అందంగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి దిగుమతైంది. తెలుగులో ఆ మధ్య ఓ హిట్ కూడా కొట్టింది. కానీ ప్రస్తుతం చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకుంటోంది ఓ ముద్దుగుమ్మ. ఓ స్టార్ హీరోను నమ్ముకొని, తను కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతానని కలలుకంటోంది. మంచి ఆఫర్లు మిస్ చేసుకుంటోంది.
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన ఆమె నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ సినిమా రిలీజైన తర్వాత తన దశ తిరిగిపోతుందని అనుకుంటోంది సదరు హీరోయిన్. ఇంతా చేసి, అందులో ఆమెది పూర్తిస్థాయి హీరోయిన్ పాత్ర కూడా కాదు.
కొన్ని మంచి కథలతో ఈమెను సంప్రదిస్తున్నారు మేకర్స్. కానీ ఆమె మాత్రం ఇప్పట్లో సినిమాలు చేయనంటోంది. ప్రస్తుతం చేస్తున్న స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని.. అప్పుడు మిగతా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తానని, పారితోషికం కూడా మూడు రెట్లు చేస్తానని ఓపెన్ గా చెప్పి పంపించేస్తోంది.
నిజానికి ఆ స్టార్ హీరోను నమ్ముకొని బాగుపడిన హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే అతగాడి సినిమాలతో అతడికే పేరొస్తుంది తప్ప, హీరోయిన్లకు బొత్తిగా క్రేజ్ రాదు. ఈ విషయం తెలియని మన హీరోయిన్ గుడ్డిగా ఆ స్టార్ హీరోను నమ్ముకుంటోంది. ఈ విషయంలో ఆ హీరోయిన్ ను భ్రమల్లో నెడుతూ, సదరు దర్శకుడు పబ్బం గడుపుకుంటున్నాడని టాక్.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు మీడియం రేంజ్ హీరోల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ “ఆ స్టార్ హీరో”ను నమ్ముకొని ప్రస్తుతం చేతిలో ఉన్న ఆఫర్లను వద్దనుకుంటోంది.