Advertisement

Advertisement


Home > Movies - Movie News

చిరు.. శ్రీముఖి,,.ఖుషీ సీన్ రీమిక్స్?

చిరు.. శ్రీముఖి,,.ఖుషీ సీన్ రీమిక్స్?

మెగాస్టార్ చిరంజీవి స్టయిల్ వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్ వేరు. చూడాలని వుంది రైల్వే స్టేషన్ సీన్ చిరు స్పెషల్. ఖుషీ లో బొడ్డు సీన్ పవన్ స్పెషల్. కానీ ఈ సీన్ ఆయన చేస్తే..?

భోళాశంకర్ సినిమాలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమిక-పవన్ ల బొడ్డు సీన్ ను చిరు-శ్రీముఖిల మీద రీమిక్స్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

నువ్వు నా బొడ్డు చూసావ్ అని శ్రీముఖి...అసలు అక్కడ బొడ్డు ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని మెగాస్టార్ ఫన్నీగా మాట్లాడుకునే సీన్ ఒకటి ప్లాన్ చేసారట.

వేదాళం సినిమా రీమేక్ గా తయారవుతున్న ఈ సినిమాను ఫుల్ ఫన్ తో తయారు చేయాలని చిరు స్వయంగా అన్నీ చూసుకుంటున్నారు. చేసుకుంటున్నారు. అందులో ఈ సీన్ ఒకటి అని టాక్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?