Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అడవి శేష్ బర్త్ డే నిర్ణయం

అడవి శేష్ బర్త్ డే నిర్ణయం

క్షణం, గూఢచారి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుని, ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఫిక్స్ చేసేసుకున్నాడు అడవి శేష్. అదే సమయంలో తనపట్టు కూడా ఎక్కడో తెలుసుకున్నాడు. అందుకే తన తరువాత ప్రాజెక్టును కూడా అదే జోనర్ లో స్టార్ట్ చేస్తున్నాడు.

ఈరోజు అడవి శేష్ బర్త్ డే. ఈ బర్త్ డే సందర్భంగా తన తరవాత ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ను అభిమానులకు గిఫ్ట్ గా అందిస్తున్నాడు. గూడఛారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 సినిమా మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసి, 2019 మధ్యలో సెట్ మీదకు వెళ్తున్నట్లు అడవి శేష్ అనౌన్స్ చేసాడు. ఈ స్క్రిప్ట్ వర్క్ రాహుల్ పాకాల అసిస్ట్ చేస్తాడు.

ఇదిలా వుంటే గూఢచారి సినిమాను దేశం అంతటా చిత్రీకరించినట్లే, గూఢచారి 2ను కూడా దేశంలోని చాలా రియలిస్టిక్ లొకేషన్లలో చిత్రీకరిస్తామని, కొంచెం బడ్జెట్ ఎక్కువే అవుతుందని చెబుతున్నాడు అడవిశేష్. 2020 నాటికి ఈ సినిమా రెడీ అవుతుందట.

సరే ఈ సినిమా సంగతులు పక్కన పెడితే, మాంచి జోరు మీదున్న అడవి శేష్ కు హ్యపీ బర్త్ డే విసెష్.

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?