ఐ సినిమా ఇచ్చిన చేదు ఫలితానికి విరుగుడు వేసి, ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు శంకర్. ఎందుకంటే ఎన్ని కోట్లు వసూళ్లు చేసినా, ఇంకా రికవరీ కావాల్సింది చాలా వుంది. అందుకే బయర్లు అక్కడ లబోదిబో మంటున్నారట.
అందుకని మళ్లీ వెంటనే విక్రమ్ తో ఓ చిన్న సినిమా చేసి, దాన్ని బయ్యర్లకు కాస్త తక్కువ కు ఇచ్చి, దానిపై లాభాలు దండుకోండి అని చెప్పాలనుకుంటున్నాడట. ఆ తరువాత అజిత్ తో భారీ సినిమా తీయాలని ప్లాన్ అంట.
చిన్న సినిమాను కనుక హిట్ చేయగలిగితే, అజిత్ సినిమాను మళ్లీ తన రేంజ్ లో అమ్ముకోవచ్చు. అంతా బాగానే వుంది. కానీ అన్ని ప్లాన్లు అనుకున్నట్లు వర్కవుట్ కావు. తేడా వస్తే వున్నది, వుంచుకున్నది కూడా పోతుంది.