అదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కు పండగే

మహేష్ బ్రహ్మోత్సవం సినిమా గురించి నెట్ లోకం లోకి మరో ఫీలర్ సర్రుమంటూ దూసుకువచ్చింది.  మహేష్ ముద్దుల కూతురు సితార ఆ సినిమాలో కనిపిస్తుందన్నదే ఆ వార్త. గతంలో నేనొక్కడినే సినిమాలో మహేష్ కొడుకు…

మహేష్ బ్రహ్మోత్సవం సినిమా గురించి నెట్ లోకం లోకి మరో ఫీలర్ సర్రుమంటూ దూసుకువచ్చింది.  మహేష్ ముద్దుల కూతురు సితార ఆ సినిమాలో కనిపిస్తుందన్నదే ఆ వార్త. గతంలో నేనొక్కడినే సినిమాలో మహేష్ కొడుకు గౌతమ్ కీలకమైన పాత్ర ధరించిన సంగతి తెలిసిందే. 

మళ్లీ అదే మాదిరిగా సితారను కూడా తన సినిమాలో పరిచయం చేయాలని మహేష్ బావిస్తున్నట్లు మరి ఎలా బయటకు వచ్చిందో ఓ ఫీలర్ వచ్చింది. మహేష్ కు వున్న ఫ్యాన్ బేస్ రీత్యా ఈ వార్త చకచకా పాకిపోయింది. మరి నిజమో కాదో క్లారిటీ ఇవ్వాల్సింది మహేష్ మాత్రమే. వేసవి విడుదల కోసం బ్రహ్మోత్సవం చకచకా ముస్తాబు అవుతోంది.