చిరంజీవి 151వ సినిమాకు టైటిల్ ఇదంటూ ఓ కొత్త టైటిల్ చలామణీలోకి వచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నా, లేదా ఉయ్యాలవాడ అన్నా కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ చిరు ఈ సినిమాను సౌత్ ప్లస్ హిందీ భాషల్లోకి భారీగా అందించాలని చూస్తున్నారు. అందువల్ల అన్ని భాషలకు సరిపడా టైటిల్ కోసం వెదికారు.
ఆఖరికి ‘మహావీర’ అనే టైటిల్ ను ఎంచుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదే టైటిల్ గా ఫిక్స్ చేసినట్లయితే సూపరే సూపర్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మహా వీర అన్న పదం అన్ని భాషలకు సరిపోతుంది.
ముఖ్యంగా మహావీర్ అన్న పదం జైనులకు ఆరాధ్యమైనది కూడా. పైగా ఉయ్యాలవాడ వీరత్వానికి, సినిమా స్పాన్ ను సూచించడానికి ఈ టైటిల్ అద్భుతంగా క్లిక్ అవుతుంది. ఇదే టైటిల్ అంటే కనుక, చిరు ఈ సినిమా క్వాలిటీ మీద ఎంత శ్రద్ధ పెడుతున్నారో టైటిల్ దగ్గర నుంచే తెలిసిపోతుంది.