అప్పుడెప్పుడో వచ్చి హిట్ అయిన “ఎ ఫిలిం బై అరవింద్” సినిమా మళ్లీ వార్తల్లోకెక్కింది. కుదిరితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు దర్శకుడు శేఖర్ సూరి. 2005లో వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథను హిందీలో రీమేక్ చేయడానికి ఇప్పటివరకు సరైన హీరోయిన్ దొరకలేదట ఈ దర్శకుడికి. సన్నీలియోన్ ను చూసిన తర్వాత రీమేక్ చేయాలనే కోరిక పుట్టిందట.
సన్నీలియోన్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో పాపులారిటీ ఉంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకుంటూనే, ఆమె అందాల్ని ఫుల్ గా చూపించాలంటే “ఎ ఫిలిం బై అరవింద్”ను హిందీలోకి రీమేక్ చేయాల్సిందేనంటున్నాడు శేఖర్ సూరి. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ కు “ఎ ఫిలిం బై అరవింద్” సరిగ్గా సరిపోతుందని అంటున్నాడు.
అంతా బాగానే ఉంది కానీ, ఈ దర్శకుడ్ని నమ్మి డబ్బులు పెట్టే నిర్మాతలు బాలీవుడ్ లో ఉన్నారా అనేది డౌట్. ఎందుకంటే శేఖర్ సూరి అనే వ్యక్తి ఎప్పుడో ఔట్ డేటెడ్ లిస్ట్ లోకి చేరిపోయాడు. తాజాగా ఈయన డైరక్ట్ చేసి రిలీజ్ చేసిన డాక్టర్ చక్రవర్తి అనే సినిమా చూస్తే ఎవరికైనా ఈ సినిమా అర్థమైపోతుంది. డాక్టర్ చక్రవర్తి అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పాటు.. మంచి టైటిల్ ను వృధా చేశాడంటూ చాలామంది శేఖర్ సూరిని ఆడిపోసుకుంటున్నారు.