వెబ్ న్యూస్ కు ఆదరణ పెరిగిన కొద్దీ ఈ రంగంలో కూడా పుట్టగొడుగులు పెరిగిపోతున్నాయి. కేవలం టెంపరరీగా హిట్ల కోసం అడ్డగోలు వార్తలు రాయడం అలవాటైపోయింది. సరే, పాపం, చిన్నవాళ్లు ఏదో వాళ్ల సైట్ల కోసం వాళ్లు చేసారు అని సరిపెట్టుకోవచ్చు. అయితే లీడింగ్ దినపత్రిలకు కూడా వెబ్ వెర్షన్లు వున్నాయి.
ఇవి ప్రింట్ వరల్డ్ లో ఎలా వున్న వెబ్ వరల్డ్ లో పోటీని తట్టకోలేకపోతున్నాయి, ఎదుర్కోలేకపోతున్నాయి. దీంతో వాటికి ఇక ఒకటే మార్గం కనిపించింది. ముఖ్యంగా ఆంధ్రలో లీడింగ్ దినపత్రికల్లో ఒకదానికి వున్న వెబ్ సైట్ కు ఒకటే కార్యక్రమం. చిన్ సైట్ అవనీ, పెద్ద సైట్ అవనీ, ఎదుటివాడి వెబ్ సైట్ లో ఏ వార్త వస్తే అది కొట్టేయడం. అంత భావ దారిద్ర్యం మరి.
అంత పెద్ద ప్రింట్ ఎడిషన్ అయి వుండీ, నెట్ వర్క్ వుండీ ఇదీ పని. ఇలా చేస్తూ, చేస్తూ, ఇటీవల రాజ్ తరుణ్ కు పెళ్లయింది ఏంకర్ లాస్యతో అని చిన్న వెబ్ సైట్ లో వచ్చిన వార్తను కూడా కొట్టేసింది. దీంతో ఇక తప్పని సరై రాజ్ తరుణ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తన ప్రమేయం లేకుండా తన పెళ్లి చేసిన వెబ్ మీడియాకు థాంక్స్ అంటూ చురకవేసాడు. ఇకపైనైనా, నిజానిజాలు తెలుసుకుని రాయడం, గ్యాసిప్ అయితే గ్యాసిప్ పద్దతిలో రాయడం చేస్తారేమో?