సినిమా టైటిల్ రిజిస్టర్ చేస్తే చాలు, బ్యానర్ ను బట్టి కథ అల్లేయడమే. హారిక హాసిని ఓ టైటిల్ రిజిస్టర్ చేసింది. 'అయినను పోయిరావలె హస్తినకు' అన్నది టైటిల్. భాగవతంలోంచి అల వైకుంఠపురములో టైటిల్ పీకినట్లే, భారతంలోంచి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ లాక్కొచ్చినట్ల కనిపిస్తోంది దర్శకుడు త్రివిక్రమ్. దాంతో ఇంకేం వుంది? హస్తినకు అంటున్నారు. రాయబారం సీన్ లా వుంది. అంటే త్రివిక్రమ్ ఈసారి ఎన్టీఆర్ తో కలిసి పొలిటికల్ స్టోరీ చేయబోతున్నారు అంటూ కథలు అల్లేస్తున్నారు.
ఇక్కడ ఓ చిన్న లాజిక్ వుంది. ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత సీరియస్ సబ్జెక్ట్. చేస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా అలాంటిదే. ముచ్చటగా మరోసారి ఫుల్ ఇంటెన్సివ్ వున్న సబ్జెక్ట్ ఎందుకు చేస్తారు?
ఇక రెండో లాజిక్. త్రివిక్రమ్ అల వైకుంఠపురములో అనే సినిమా రిజల్ట్ చూసారు. తను తీసే ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ కు ఎంత స్కోప్ వుందో అర్థం అయింది. అలాంటపుడు మళ్లీ అరవింద సమేత మాదిరిగా సీరియస్ లైన్ ఎందుకు తీసుకుంటారు? పైగా ఎన్టీఆర్ పొలిటికల్ సబ్జెక్ట్ లకు దూరంగా వుంటారు. అది అందరికీ తెలిసిందే.
ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేయబోతున్నారు. అది కూడా జంధ్యాల సినిమాల మాదిరిగా పడి పడి నవ్వుకునే హెల్దీ ఎంటర్ టైన్ మెంట్.