ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆప్ అధినేత, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భయంతో వణికిపోతున్నారు. సహజంగా ప్రచార పిచ్చి బాగా ఉన్న బాబు…ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ తెలియగానే బాబు ముందస్తు ప్రకటన చేసేవాడు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం ఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌ను ప్రచారానికి రప్పించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునే బాబు…ఆప్ ఢిల్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న తన అభిప్రాయాన్ని మాత్రం మీడియాకు చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు.
కేజ్రీవాల్ విజయంపై ఎవరెవరు ఎలా స్పందించారో ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను ఒకసారి పరిశీలిద్దాం.
ఈనాడుః
కేజ్రీవాల్‌కు ప్రముఖుల అభినందనలు శీర్షికతో ఓ కథనాన్ని ఇచ్చారు. ఈ కథనంలో కేజ్రీ విజయంపై ఎవరెవరి స్పందన ఏంటో రాశారు.
భాజపాను తిరస్కరించారుః మమతాబెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం
అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు. భాజపాను ప్రజలు తిరస్కరించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ను వద్దన్నారు. కేవలం అభివృద్ధ మాత్రమే విజయం తెచ్చిపెడుతుంది. ప్రజాస్వామ్యం గెలిచింది.
మతతత్వ రాజకీయాలను అభివృద్ధి తొక్కిపెడుతుందనేందుకు ఇదే నిదర్శనంః డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్
ఢిల్లీలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కేజ్రీవాల్‌కు, ఆప్‌నకు శుభాకాంక్షలు. మతతత్వ రాజకీయాలను అభివృద్ధి తొక్కిపెడుతుందనేందుకు ఈ విజయమే నిదర్శనం.
కొత్త ఒరవడి సృష్టించాలిః కేరళ సీఎం పినరయి విజయన్
ఢిల్లీ ఎన్నికల్లో దద్దరిల్లే విజయం సాధించిన కేజ్రీవాల్, ఆప్‌నకు అభినందనలు. ఈ విజయం దేశంలోని సమీకృత రాజకీయాలకు, ప్రజా అనుకూల ప్రభుత్వాలకు కొత్త ఒరవడి సృష్టించాలి.
విద్వేష రాజకీయాలకు ప్రజలు గట్టిగా నో చెప్పారుః డీఎంకే ఎంపీ కనిమొళి
విద్వేష రాజకీయాలకు ప్రజలు గట్టిగా నో చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్, ఆప్‌నకు శుభాకాంక్షలు.
ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నాంః బీజేపీ ఎంపీ గౌతమ్‌గంభీర్
ఎన్నికల ఫలితాలను మేం అంగీకరిస్తున్నాం. ఈ ఎన్నికల్లో మేం మా వంతు ప్రయత్నం చేశాం. బహుశా ప్రజల్ని మెప్పించలేకపోయాం. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ప్రజలకు అభినందనలు. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.
ఆంధ్రజ్యోతిః
'కేజ్రీవాల్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు, మమత' అనే శీర్షికతో చిన్న వార్త ఇచ్చారు. ఈ వార్త ఎలా సాగిందంటే….
'ఆప్ సాధించిన విజయంపై కేజ్రీవాల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు' అని రాసుకెళ్లారు. అలాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పందనను ప్రత్యేకంగా ఇచ్చారు.
బీజేపీని తిప్పికొట్టారు: మమత
ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ను అభినందించారు. 'కేజ్రీవాల్‌కు నా శుభాభినందనలు. బీజేపీని ప్రజలు తిప్పికొట్టారు. అభివృద్ధి మాత్రమే ఈ ఎన్నికల్లో పని చేసింది. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను ఓటర్లు తోసిపుచ్చారు' అని మమత పేర్కొన్నారు.
బాబు తన భగవద్గీతగా చెప్పుకునే ఈనాడు పత్రికలో అసలు బాబు స్పందనే లేకపోవడం గమనార్హం. ఇక ఈనాడు తోకపత్రిక ఆంధ్రజ్యోతిలో బాబు, మమత కేజ్రీవాల్‌కు ఫోన్ చేసి అభినందనలు చెప్పారని రాశారు. ఇందులో కూడా కేవలం మమతా బెనర్జీ బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని, సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను ఓటర్లు తోసిపుచ్చారని ఘాటుగా స్పందించారు.
కానీ మన చంద్రబాబు మాత్రం కేవలం కేజ్రీవాల్‌కు ఫోన్ చేశారని రాశారే తప్ప, ఏం మాట్లాడారో, ఈ విజయాన్ని ఎలా చూడాలో నామ మాత్రంగా కూడా పేర్కొనలేదు. సహజంగా ఢిల్లీలో ఆప్ విజయాన్ని టీడీపీ ఖాతాలో ఈ పాటికి వేయాలి. టీడీపీ దెబ్బతో బీజేపీ దేశ రాజధానిలో మట్టికొట్టుకుపోయిందని టీడీపీ నేతలు ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఏపీలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునేవాళ్లు. కానీ కేజ్రీవాల్ విజయంపై ఎలాంటి ప్రకటన ఇస్తే, ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో బాబు అండ్ అండ్ కో ఉచ్చ పోసుకుంటోంది. దానికి నిలువెత్తు నిదర్శనం కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకున్న జాగ్రత్తలే.