చిరకాలంగా వార్తల్లోనే కనిపిస్తూ, స్క్రీన్ మీదకు రావడం కనిపించని వారసుడు నందమూరి మోక్షజ్ఞ. అసలు వస్తాడో..రాడో కూడా తెలియదు. వస్తాడని తండ్రి బాలయ్య చెప్పడమే తప్ప, రావడం లేదు. అది ఎప్పుడో తెలియదు. ఫ్యాన్స్ కూడా మొదట్లో పాత ఫొటోనే వేసి బర్త్ డే విసెష్ చెప్పేవారు. రాను రాను అది కూడా తగ్గిపోయింది.
నిజంగా కొడుకు విషయంలో బాలయ్య సీరియస్ గా వుండి వుంటే తనతో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని లాంటి వాళ్లతో ఎప్పడో కొడుకు ప్రాజెక్టును సెట్ చేసి వుండేవారు. కానీ ఆదిత్య 369 సీక్వెల్ అని, మరోటి అనీ మరింత వెనక్కు తోసుకు వెళ్తున్నారు తప్ప, ముందుకు తీసుకువస్తున్న దాఖలా అయితే కనిపించడం లేదు.
ఈ లోగా టాలీవుడ్ లో అనేకానేక రూమర్లు. మోక్షజ్ఞకు సినిమాల మీద అంత ఆసక్తి లేదని, అసలు అతని శరీరాకృతి హీరోకు సరిపడే విధంగా లేదని, భారీ కాయాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో వున్నారని, ఇలా రకరకాల రూమర్లు.
ఇలాంటి నేపథ్యంలో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా మంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని, డైరక్టర్లను కూడా ఫిక్స్ చేసేసారని వార్తలు. అసలు బాలయ్యనే ఆదిత్య 369 సీక్వెల్ ను తను రెండు చారిత్రాత్మక, పౌరాణిక పాత్రలు ధరిస్తూ మోక్షజ్ఞతో చేయాలని ఫిక్స్ అయి వున్నారు.
అది ఇప్పట్లో కాదు. మరి ఆయన ఆలోచనలు అలా వుంటే, అసలు మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్స్ నే బయట కనిపించని నేపథ్యంలో ఈ వార్తలు ఏమిటో?