కరోనా నేపథ్యంలో అన్ని రంగాల్లో పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. అయినా కూడా సినిమా జనాలు షూటింగ్ లు చేయడానికి ముందు వెనుక ఆడుతున్నారు. కానీ టీవీ కార్యక్రమాలకు మాత్రం ప్రభుత్వ నిబంధనలు అంత సమస్యగా లేవు.
ఎందుకంటే టీవీ షో లకు మరీ ఎక్కువ మంది క్రూ అవసరం లేదు. అందుకే వీలయినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, పాపులర్ టీవీ షో లు అదిరింది, జబర్దస్త్ ల షూటింగ్ లను ప్రారంభించేసారు. నానక్ రామ్ గుడా లో జబర్దస్త్, అన్నపూర్ణలో అదిరింది షూట్ లు ప్రారంభమయ్యాయి. మరీ ఎక్కువగా కాకుండా రోజుకు కేవలం పన్నెండు ఎపిసోడ్ లు మాత్రమే చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అదిరింది కి నాగబాబు, జబర్దస్థ్ కు రోజా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ లో కొత్త మార్పులు కూడా చేస్తున్నారు. షకలకశంకర్ మళ్లీ సినిమాల నుంచి వెనక్కు వచ్చి జబర్దస్త్ లో ఎంటర్ అవుతున్నారు. కరోనా నేపథ్యలో అదిరింది కార్యక్రమం నిలిచిపోయింది. జబర్దస్త్ మాత్రం పాత ఎపిసోడ్ లనే సెలెక్టెడ్ గా ప్రసారం చేస్తూ వస్తున్నారు.