టాలీవుడ్ దాదాపు ఏడెనిమిది నెలలు వెనక్కు వెళ్లిపోయింది. మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కాలం టాలీవుడ్ కాలం నుంచి మాయం అయిపోయినట్లే. ఇప్పటికి ప్లాన్ చేసిన సినిమాలు అన్నీ పూర్తి కావాల్సి వుంది. ఇప్పటి వరకు ప్లాన్ చేసినవి, ఫిక్స్ అయినవి అక్టోబర్ నుంచి ప్రారంభమై, వరుసగా పూర్తి కావడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుంది. అందువల్ల కీలకమైన క్యారెక్టర్ నటులు, బ్యానర్లు ముఖ్యమైన పెద్ద హీరోల సినిమాలకు అంకితమైపోతాయి.
చిన్న, బిలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు చాలా ప్లానింగ్ లో వున్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్నది మాత్రం అస్సలు క్లారిటీ లేదు. థియేటర్లు ఒపెన్ కావాలి.మార్కెట్ ట్రెండ్ తెలియాలి. అప్పుడు ఈ చిన్న, బిలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు మళ్లీ ప్లాన్ చేస్తారు.
కానీ అలా అని షూట్ లు కూడా ప్రారంభం కావు. కీలకమైన సినిమాలు అన్నీ ఓ కొలిక్కిరావాలి. అప్పుడే వీటికి కదలిక వస్తుంది. ఇవన్నీ జరగాలంటే కనీసం ఇప్పటి నుంచి ఆరేడు నెలలు పడుతుందని అంచనా. అప్పటి వరకు ఈ రేంజ్ హీరోలు అంతా ఇన్ స్టా లోనో, ట్విట్టర్ లోనో ఏదో ఒక పిక్ వదులుతూ, వార్తల్లో వుంటూ రావడానికి కిందా కావాల్సిందే. ఇప్పుడు బిలో మిడిల్ రేంజ్ హీరోల దగ్గర నుంచి ఇలా సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టాలా? ఆ విధంగా ఎలా న్యూస్ ల్లో వుండాలా? అని కిందా మీదా అవుతున్నారు. మరో ఆర్నెల్లు ఇలాగే వుండాలి.