బాలీవుడ్లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల జోరు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. అడల్ట్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన సన్నీలియోన్ రాకతో బాలీవుడ్లో ఈ జోరు మరింత పెరిగింది. అడల్ట్ స్టార్ సన్నీలియోన్‌తో పోటీ పడేందుకు బాలీవుడ్ హీరోయిన్లూ గ్లామర్ పరంగా హద్దులు చెరిపేసుకుంటున్నారు.
ఇక, ఈ తరహా సినిమాలకి స్పెషలిస్ట్‌గా నిర్మాత ఏక్తా కపూర్ గురించి చెప్పుకోవచ్చు. తాజాగా ఏక్తాకపూర్ అడల్ట్ కంటెంట్‌తో మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతోందట. ఈ సినిమాకి హీరోయిన్గా తాప్సీ పేరుని ఏక్తా కపూర్ పరిశీలిస్తోదని సమాచారం. ఏక్తా కపూర్ అంటే బాలీవుడ్లో పేరున్న నిర్మాత కావడంతో తాప్సీ కూడా ఆమెతో కలిసి వర్క్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాప్సీకి గ్లామర్ షో కొత్తేమీ కాదు. తెలుగు, తమిళ సినిమాల్లో అందాల విందు కోణంలో చూస్తే తాప్సీ రెచ్చిపోయిందనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్‌తో విలక్షణ సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న తాప్సీ, షడెన్‌గా అడల్ట్ కంటెట్ ఉన్న సినిమాల్లోకి ఎందుకు దిగుతోందో అర్థం కావడంలేదని బాలీవుడ్ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
అడల్ట్ కామెడీ నేపథ్యంలో ఏక్తాకపూర్ నిర్మిస్తున్న సినిమాలో తాప్సీ నటించడం దాదాపు ఖాయమైపోయింది. అయితే, 'అడల్ట్ కంటెంట్' ఉన్నా ఎక్కువగా ఏక్తాకపూర్ థ్రిల్లర్ సినిమాల్నే తెరకెక్కించింది. చాలా సినిమాలతో సూపర్ సక్సెస్‌లని అందుకుంది కూడా. మరి, ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న కామెడీ ఎంటర్టైనర్తో అటు ఏక్తాకపూర్, ఇటు తాప్సీ విజయాన్ని అందుకుంటారా.? వేచి చూడాల్సిందే.