అడ్వాన్స్ బయోపిక్ అవార్డులు?

ఏటా విదేశాల్లో హడావుడి చేసే సైమా అవార్డుల కార్యక్రమం మళ్లీ మొదలైంది. ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే సైమా నిర్వాహకులే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు కూడా కావడం. అందుకే బయోపిక్ టీమ్ కు కలిసి వచ్చినట్లు…

ఏటా విదేశాల్లో హడావుడి చేసే సైమా అవార్డుల కార్యక్రమం మళ్లీ మొదలైంది. ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే సైమా నిర్వాహకులే, ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు కూడా కావడం. అందుకే బయోపిక్ టీమ్ కు కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. బాహుబలి 2 అవార్డులను కొల్లగొట్టడం అన్నది కామన్. అదే బాహుబలి జనాలు బయోపిక్ కనెక్షన్ వుంటే..

రానా, కీరవాణి, కాలభైరవ లాంటి వాళ్లందరికీ రెండింటితో కనెక్షన్ వుంది. ఇప్పుడు వారికే సైమా అవార్డలు లభించాయి. సంగీత దర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ సంగతి అలా వుంచితే, నారా చంద్రబాబు క్యారెక్టర్ పోషిస్తున్న రానాకు మోస్ట్ ఎంటర్ టైనర్ అవార్డు అంటూ ఒకటి ఇస్తున్నారు. బాహుబలి, ఘాజీ, నేనేరాజు నేనేమంత్రి సినిమాలు మూడింటికి కలిపి ఈ అవార్డు అంట.

సరే, కానీ బాలయ్య బాబుకు బాహబలికి కనక్షన్ లేదు. బెస్ట్ యాక్టర్ అంటే ప్రభాస్ వున్నాడు. మరెలా? అందుకే బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అని ఓ అవార్డు బాలయ్యకు అందిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణిలో బాలయ్య నటనకు క్రిటిక్స్ ఈ అవార్డు అందివ్వాలని డిసైడ్ చేసారట. ఏ క్రిటిక్స్ నో? ఎప్పుడో?

చిత్రమేమిటంటే, క్రిష్ డైరక్ట్ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి (క్రిష్ నే బయోపిక్ డైరక్టర్ కూడా)కు బెస్ట్ పిక్చర్ గా మళ్లీ క్రిటిక్స్ విభాగంలోనే అవార్డు ఇవ్వడం. దీన్ని క్రిటిక్స్ ఎప్పుడు ఎంపిక చేసారో? కానీ పాపం, బెస్ట్ డైరక్టర్ (క్రిటిక్స్) అంటూ అవార్డు పెట్టలేదు. క్రిష్ కు ఇవ్వలేదు. ఈ లెక్కన ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన ఏడాది సైమా అవార్డులు అన్నీ దానికే వచ్చేలా  వున్నాయి అని గుసగుసలు వినిపిస్తున్నాయి.