సినిమా రంగంలో అడ్వాన్స్ లు చేతిలో పెట్టడం అన్నది వెరీ కామన్. గెలుపు గుర్రాలను ముందే పసిగట్టి, వాటి లెవెల్ మేరకు లక్షల్లో, కోట్లో అడ్వాన్స్ గా చేతిలో పెట్టేయడం అలవాటే నిర్మాతలకు. తాము అనుకున్నట్లుగా, ఆ గుర్రం స్పీడందుకుంటే, అడ్వాన్స్, అగ్రిమెంట్ గుర్తు చేసి, నిర్మాతలు వెంబడతారు.
కానీ ఇప్పుడు ఓ నిర్మాతకు కేసు రివర్స్ లో వుందట. ఓ డైరక్టర్ మాంచి స్పీడు మీద వున్నపుడు ఈ నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. తీరా ఆ తరువాత ఆ డైరక్టర్ వరుసగా రెండు డింకీలు కొట్టాడు. దాంతో మరి ఏ హీరో ఆ దర్శకుడిని దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఇప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చారుగా..సినిమా చేస్తా..అంటూ నిర్మాతల వెంట పడుతున్నాడట ఆ డైరక్టర్.
ఆయన చేస్తాడు సరే, హీరో ఎక్కడ దొరుకుతాడు బాబూ అంటూ ఆ నిర్మాతలు తప్పించుకు తిరుగుతున్నారట. టైమ్ బాగోకుంటే తాడు పాము అయిపోతుందంటే ఇదే.