అద్భుతంగా ఆరంభం వుంటుంది అనుకుంటే, సినిమా కాస్తా కిందా మీదా అవుతోంది. క్వాలిటీ బాలేదో, సినిమా క్లారిటాగా లేదో మొత్తానికి ఆలస్యం అవుతోంది. దాంతో ఆ హీరో ఒక్కసారిగా అలిగి, తండ్రితో నాలుగు రోజులు మాట్లాడడం మానేసాడని టాలీవుడ్ గుసగుసల సారాశం. అంతే కాదు. సినిమా వాయిదా వేయాలని డిసైడ్ చేసిన రోజునో, డిసైడ్ చేసినపుడో, ఆ చినబాబుగారి ఖాతాలో ఇంట్లోని విలువైన సామాన్లు జమైపోయి, కరుసైపోయాయని వినికిడి.
ఇదే తొలి అనుభవం కావడంతో, అంతా అయిపోయింది..అంతా మీరే చేసారు..అనేసుకుంటున్న ఆ కుర్ర హీరోకు కాస్త మంచి మాటలుచెప్పి, ఈ సినిమా ఒక్కటే కెరీర్ కాదు, ఇంకా చాలా వుంది వ్యవహారం. ప్రతి పెద్దహీరో కూడా దెబ్బలు తిన్నవాడే..వర్రీకావద్దు..అని నచ్చే చెప్పేసరికి ఆ తండ్రికి, తన తండ్రి దిగివచ్చినంత పనైందట.