‘ఆహా’ కు టోకున అమ్మేసారు

యువి క్రియేషన్స్ సంస్థ యువి కాన్సెప్ట్స్ అనే పేరుతో కొత్త బ్యానర్ పెట్టి చిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. ఇదే సంస్థ దర్శకుడు మారుతి స్వంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ భాగస్వామ్యంతో…

యువి క్రియేషన్స్ సంస్థ యువి కాన్సెప్ట్స్ అనే పేరుతో కొత్త బ్యానర్ పెట్టి చిన్న సినిమాలు తీయడం ప్రారంభించింది. ఇదే సంస్థ దర్శకుడు మారుతి స్వంత బ్యానర్ మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ భాగస్వామ్యంతో నిర్మించిన చిన్న సినిమా మంచి రోజులు వచ్చాయి. 

జస్ట్ మూడున్నర కోట్ల తో తీసిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ఆహా ఓటిటి సంస్థకు అమ్మేసారు. అయితే ఈ ఒక్క సినిమానే కాదు. దీంతో పాటు యువి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్న మరో రెండు మూడు సినిమాలు కలిపి మొత్తం ఒకేసారి గుత్తగా అమ్మేసారు. 

యువి సంస్థ మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న పక్కా కమర్షియల్. అలాగే సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న మరో చిన్న సినిమా, మహి డైరక్షన్ లో తయారుచేయబోయే శ్రద్ద శ్రీనాధ్ నటించే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా, ఇలా అన్నీ కలిపి డిజిటల్ హక్కులను ఆహా కు విక్రయించేసారు.

మొత్తం మీద 13 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. కాదు 17 కోట్లు అని కూడా అంటున్నారు. కానీ అంతలేదు, అన్నీ కలిపి 13 కోట్లు అని కూడా అంటున్నారు. మొత్తం మీద టోకున సినిమాలు అన్నీ కలిసి డిజిటల్ హక్కులను ఆహాకు అమ్మేయడం మాత్రం జరిగిపోయింది.