అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ వ్యవహారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మలయాళంలో పృధ్వీరాజ్ క్యారెక్టర్ గురించి సందేహమే లేదు. ఎందుకంటే రానా ఫిక్స్ అయిపోయాడు. కానీ అసలు అయ్యప్పన్ క్యారెక్టర్ కోసం మాత్రం ముందుగా బాలయ్య అనుకున్నారు.
ఆయన కాదని రవితేజ దగ్గరకు వెళ్లారు. ఇంతలో పవన్ తాను రెడీ అనడంతో రవితేజను వదిలేసారు. కానీ రానా పేరు మార్పు గురించి ఆలోచనే లేదు.
కానీ ఎప్పుడయితే పవన్ పేరు ఫిక్స్ అయిందో ఇప్పుడు రానానా? మార్చాలా అన్న ఆలోచన చేస్తున్నారని వినిపిస్తోంది. ఓ యంగ్ హీరో పేరు పరిశీలనకు తీసుకున్నారు. కానీ పవన్ కు కాస్త ఆటిట్యూడ్ వుంటుంది పెద్ద హీరోగా, ఈ యంగ్ హీరోకు కాస్త ఆటిట్యూడ్ వుందని టాక్ వుంది. అనవసరంగా సెట్ లో ఏమన్నా తేడా జరిగితే సమస్య వస్తుందని ఊరుకున్నారని బోగట్టా.
ఇక పృధ్వీరాజ్ క్యారెక్టర్ కు దీటైన వారు ఎవరు? అసలు రానాను ఎందుకు తప్పించాలి? పవన్ అంటే రానా చేయనంటున్నారా? లేక రానా అంటే పవన్ చేయనుంటున్నారా? అసలు పవన్ పేరుతో పాటే రానా పేరు కూడా ఎందుకు ప్రకటించలేదు? ఈ రెండూ కాదంటే అసలు రానా ను మారుస్తారనే వార్తలు ఎందుకు వినవస్తున్నాయి? ఇవన్నీ సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు.