భాజపా నేత అమిత్ షాకు తలనొప్పి వచ్చినా, కాస్త జ్వరం వచ్చినా చంద్రబాబు ఫోన్ చేస్తారు. ఎలావుందీ అని వాకబు చేస్తారు. కావాలంటే నాలుగు పారాసెటిమోల్ టాబ్లెట్లు ఫ్లయిట్ లో పంపించమంటారా? అని అడిగినా అడుగుతారు.
మర్నాడు. ఈ విషయం ఆయన అనుకుల మీడియాలో బ్రహ్మాండగా ప్రచురిస్తారు. హమ్మయ్య మా బాబుగారు మళ్లీ ఏలాగోలా, కాలో..విడియోకాలో చేసి భాజపాకు దగ్గరవుతున్నారని పార్టీ కేడర్ కు కాస్త భరోసా.
మరే మంత్రినో కిడ్నీలో రాళ్లతోనో, మరో సమస్యతోనో భాధ పడుతుంటారు. వెంటనే బాబుగారి నుంచి పోన్. మర్నాడు వార్త. మళ్లీ కేడర్ కు చిన్న ఆశ..బాబుగారు కాలో, విడియో కాలో చేసి భాజపాకు దగ్గరైపోతున్నారన్న ఆనందం.
ఎందుకిదంతా అంటే భాజపా సపోర్టు లేకుండా బాబుగారు జగన్ ను ఏమీచేయలేరని పార్టీ కేడర్ ఏనాడో ఫిక్స్ అయిపోయారు. బాబుగారు కూడా అలాగే ఫిక్స్ అయిపోయారు. మనవల్ల కాదు, మోడీ తో తప్ప మరెవరివల్లా కాదు. అని ఆయన నిత్యం ఢిల్లీలో ఎవరి బర్త్ డేలు, ఎవరు సిక్ గా వున్నారు ఇలాంటివి అన్నీ తెలుసుకుని కాల్ నో, విడియోకాల్ నో చేసుకోవడం పనిగా పెట్టకున్నారు.
ఇలాంటి టైమ్ లో తెలంగాణలో దుబ్బాక ఎన్నిక వచ్చింది. హైదరాబాద్ లో వందల కోట్ల పార్టీ ఆఫీసును అలా నిలబెట్టుకోవడం కోసం (ఎందుకంటే అది ప్రభుత్వ భూమిలో కట్టింది కనుక) తెలుగుదేశం జాతీయపార్టీ అని, తెలంగాణ విభాగం అనీ నిర్వహిస్తున్నారు తప్ప, తెలంగాణలొ పోటీ అన్నది పొరపాటున కూడా చేయరు. దుబ్బాక ఎన్నికలో భాజపాకు కష్టం వచ్చింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసారు. ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ పొరపాటున కూడా కేసిఆర్, కేటిఆర్ ల పేరు లేకుండా జాగ్రత్త పడి ప్రెస్ నోట్ ఇచ్చి తన పని అయిపోయింది అనిపించారు. ఇదే ఆంధ్రలో అయితే జగన్ రెడ్డి అని సంబోధించి, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని ఖండించేవారు. ఇక్కడ మాత్రం అలాంటి సాహసం అస్సలు చేయలేదు.
సరే ఇక ఢిల్లీ కి ఊ అంటే కాలో, విడియో కాలో చేసే బాబుగారు ఈసారి చేయి కూడా చేసుకుని, ఓ ప్రకటన కూడా ఇవ్వలేదు. ఖండించలేదు. అసలే ఎసిబి కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణకు వస్తోంది. ఇలాంటి టైమ్ లో కెలుక్కోవడం అనవసరం అనుకున్నారేమో? లేదా మనకు ఢిల్లీ జనాలు కావాలి కానీ తెలంగాణ గల్లీలతో ఏం పని అనుకున్నారేమో, కామ్ గా ఊరుకున్నారు.
ఏమైతేనేం మనది ఇంకా జాతీయ పార్టీనే. ఎందుకంటే తెలంగాణలో కోట్ల విలువ చేసే పార్టీ ఆఫీసు వుంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు తెలంగాణలోనే వుంటారు. ఆయన కోట్ల విలువైన స్వంత భవనం తెలంగాణలోనే వుంది. పైగా తమ స్వంత కంపెనీ హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ కూడా హైదరాబాద్ నే. అందువల్ల తెలుగుదేశం తెలంగాణ లో పోటీ చేసినా చేయకున్నా, తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై కామెంట్ చేసినా చేయకున్నా, తెలంగాణ వరదలకు స్పందించినా స్పందించకున్నా, తెలుగుదేశం కచ్చితంగా జాతీయ పార్టీనే.