అఖిల్ చూపు వీళ్లపై లేదేలనో?

రెండో సినిమాకు సరైన డైరక్టర్ దొరక్క కిందా మీదా అవుతున్నాడు హీరో అఖిల్. కానీ ముగ్గురు డైరక్టర్ల మీద అఖిల్ చూపు పడడం లేదు. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాను ఆల్ మోస్ట్…

రెండో సినిమాకు సరైన డైరక్టర్ దొరక్క కిందా మీదా అవుతున్నాడు హీరో అఖిల్. కానీ ముగ్గురు డైరక్టర్ల మీద అఖిల్ చూపు పడడం లేదు. ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమాను ఆల్ మోస్ట్ ఫినిష్ చేసాడు సుకుమార్. పండగకు సినిమా విడుదలైపోతే, ఇక సుక్కు ఖాళీనే. 

అలాగే అల్లు అర్జున్ తో సరైనోడు సినిమా చేస్తున్నాడు బోయపాటి. అది కూడా చివరి దశకు చేరుకుంది. ఆ తరువాత బాలయ్య వందో సినిమా వుంది కానీ, గ్యాప్ కొంత వుండే అవకాశం వుంది. అలాగే రచ్చ తో సైలంట్ హిట్..బెంగాల్ టైగర్ తో ఫరవాలేదనే హిట్ కొట్టాడు సంపత్ నంది. ఇప్పుడు అతగాడు రెస్ట్ లోనే వున్నాడు.  వీళ్లలో ఎవర్ని ఎంచుకున్నా, అఖిల్ రాబోయే సమ్మర్ కు ఓ సినిమా అందించేయచ్చు.