డిక్టేటర్ పై కాంగ్రెస్ స్పందిస్తుందా?

డిక్టేటర్ సినిమాలో సోనియాను పోలిన పాత్ర వుంటుందని, అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి దాన్ని నటిస్తుందని, గ్రేట్ ఆంధ్ర ఏనాడో వెల్లడించింది. ట్రయిలర్ చూడగానే అదే నిజమని అర్థమయింది. అయితే సోనియా గాంధీ రూపానికి…

డిక్టేటర్ సినిమాలో సోనియాను పోలిన పాత్ర వుంటుందని, అలనాటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి దాన్ని నటిస్తుందని, గ్రేట్ ఆంధ్ర ఏనాడో వెల్లడించింది. ట్రయిలర్ చూడగానే అదే నిజమని అర్థమయింది. అయితే సోనియా గాంధీ రూపానికి దగ్గరగా కాదు కానీ, ఓ లేడీ విలన్..ఆమె అల్లుడు మరోవిలన్ గా డిక్టేటర్ లో కనిపిస్తున్నారు. 

పైగా ఢిల్లీ నేపథ్యం. అంటే ఇన్ డైరక్ట్ గా సోనియాను..ఆమె అల్లుడు వాద్రాను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.మరి అసలు విషయం ఏమిటో? ఏ మేరకు వారితో పోలికలు వుంటాయో సినిమా చూస్తే కానీ తెలియదు. సాధారణంగా కొంచెం ఉప్పందితే చాలు వారి వారి అభిమానులు సినిమాలై విమర్శలు ఎక్కుపెడతారు. మరి సినిమాలో కనుక సోనియా, వాద్రాల పోలికలు, డైలాగులు వుంటే కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో? 

అయితే విభజన తరువాత ఆల్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నది కిందకు దిగజారిపోయింది. ఇక మరి ఏం మాట్లాడుతుంది? అందుకే ఆ దైర్యంతోనే సోనియా, వాద్రా లను పోలిన పాత్రలను పెట్టి వుంటారేమో డిక్టేటర్ సినిమాలో?