Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా లేదు కానీ గ్యాసిప్ లకు లోటులేదు

సినిమా లేదు కానీ గ్యాసిప్ లకు లోటులేదు

హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ సినిమా తరువాత హిట్ అన్నదాని కోసం మొహం వాచాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి పాత సినిమాల రీమిక్స్ సినిమా చేసి, ఫరవాలేదు అనిపించుకున్నాడు. కానీ అంతకు ముందు రామయ్యా వస్తావయ్యా ఫలితం, సుబ్రహ్మణ్యం కలెక్షన్లు అంచనా వేసి ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. అయినా ఫీలర్లకు మాత్రం కొదవ వుండడం లేదు.

కొన్నాళ్లు బన్నీ పేరు వినిపించింది. కొన్నాళ్లు మరో హీరో పేరు వినిపించింది. ఇప్పుడు తాజగా రవితేజ పేరు వినిపిస్తోంది. కానీ రవితేజ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయి వున్నాడు. అది కాక సుధీర్ వర్మ కథకు ఓకె చెప్పి వున్నాడు. మరింక రవితేజ ఎప్పుడు దొరుకుతాడు హరీష్ కు? ఇక మళ్లీ ఏదో విధంగా సాయి ధరమ్ తేజతోనే ఇంకో ట్రయిల్ వేయాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?