అఖిల్ సినిమాకు గ్రాఫిక్ హంగులు?

అఖిల్ తో వినాయక చేయబోయే సినిమాకు సంబంధించిన అనేక కబుర్లు వినిపిస్తున్నాయి. అఖిల్ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ దర్శకుడు ఎవరు అనేది, నిర్మాత ఎవరు అన్నదే హడావుడిగా వుండేది. ఇప్పుడు అసలు వినాయక్ ఎలాంటి…

అఖిల్ తో వినాయక చేయబోయే సినిమాకు సంబంధించిన అనేక కబుర్లు వినిపిస్తున్నాయి. అఖిల్ సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ దర్శకుడు ఎవరు అనేది, నిర్మాత ఎవరు అన్నదే హడావుడిగా వుండేది. ఇప్పుడు అసలు వినాయక్ ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్నది టాపిక్ గా వుంది. 

అల్లుడు శీను లాంటి భారీ లాంచింగ్ సినిమాకు కూడా ఎటువంటి హడావుడి, లేకుండా కామన్ మాన్ కు ఎలాంటి సినిమా నచ్చుతుందో అలాంటిది తీసి, హిట్ కొట్టాడు వినాయక్.

 ఇప్పుడు నాగ్ మరి ఇలాంటి కథ అంటే ఓకే అంటాడా అన్నది అనుమానం. అందునా ఇప్పుడు నాగ్ మనం హ్యాంగోవర్ లో వున్నారు. డిఫరెంట్ కథల వైపే చూస్తున్నారు. అందుకే వినాయక్ మాంచి గ్రాఫిక్స్ అవసరమైన స్టోరీ లైన్ చెప్పాడని తెలుస్తోంది. ఈ స్టోరీకి ఇలాంటి అలాంటి గ్రాఫిక్స్ కాదు,..సిజి వర్క్ కాస్త భారీగానే కావాల్సి వుంటుందని తెలుస్తోంది. 

ఇదిలా వుంటే కళ్యాణ్ అనే కొత్త దర్శకుడి సారథ్యంలో చేయాలనుకుంటున్న కథాంశానికి కూడా కాస్త ఫాంటసీ టచ్ వుంటుందని తెలుస్తోంది. మొత్తానికి నాగ్ ఇప్పుడు కొత్తదనం కోసం చూస్తున్నారు.