బాలయ్య సినిమాకు ఇక నో ట్రబుల్స్?

బాలయ్య బాబు లెజెండ్ లాంటి సూపర్ హిట్ తరువాత చేస్తున్న సినిమాకు రమణరావు నిర్మాత, సత్యదేవ్ దర్శకుడు. ఈ సినిమా బాలయ్య పోలిటికల్, హాస్పిటల్ వ్యవహారాల కారణంగా కాస్త నెమ్మదిగా నడుస్తోంది.  Advertisement దీనికి…

బాలయ్య బాబు లెజెండ్ లాంటి సూపర్ హిట్ తరువాత చేస్తున్న సినిమాకు రమణరావు నిర్మాత, సత్యదేవ్ దర్శకుడు. ఈ సినిమా బాలయ్య పోలిటికల్, హాస్పిటల్ వ్యవహారాల కారణంగా కాస్త నెమ్మదిగా నడుస్తోంది. 

దీనికి తోడు ఆ మధ్య నిర్మాత కు కాస్త డబ్బు సమస్యలు, దర్ళడుడితో పొంతన కరువు కావడం వంటి సమస్యలు వచ్చినట్లు టాక్.  నిర్మాత రమణారావు వితవుట్ ఫైనాన్స్ తో సినిమా చేయాలని అనుకోవడం వల్ల ఈ సమస్య అని తెలుస్తోంది. 

ఇప్పుడు ఆయన తన రిసోర్సెస్ అన్నీ సెట్ చేసుకోవడంతో ఆ సమస్యలు పరిష్కారమయ్యాయట. అదే సమయంలో డైరక్టర్ తో వున్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమైపోయాయని వినికిడి. 

ప్రస్తుతం బాలయ్య ఎమ్మెల్యేగా అనంతపురంలో వున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన తిరిగి రాగానే ఈ సినిమా తరువాతి షెడ్యూలు మొదలవుతుంది.