ఇదేంటి ‘గోపాలా..’.,అదేంటి ‘ముకుందా’?

సంక్రాంతి సరిగ్గా రెండు నెలల దూరంలో వుండగానే పందెం పుంజులను వదిలేందుకు టాలీవుడ్ రెడీ అయిపోతోంది. మెగాక్యాంప్ కు చెందిన ఇద్దరు హీరోల సినిమాలు పండుగకు ఖాయమంటూ ప్రకటనలు వచ్చేసాయి. మరోపక్క పూరి-ఎన్టీఆర్ సినిమా…

సంక్రాంతి సరిగ్గా రెండు నెలల దూరంలో వుండగానే పందెం పుంజులను వదిలేందుకు టాలీవుడ్ రెడీ అయిపోతోంది. మెగాక్యాంప్ కు చెందిన ఇద్దరు హీరోల సినిమాలు పండుగకు ఖాయమంటూ ప్రకటనలు వచ్చేసాయి. మరోపక్క పూరి-ఎన్టీఆర్ సినిమా రెడీ అయిపోతోంది. సోమవారం తెల్లవారుతూనే వరుణ్ తేజ్ తొలిసినిమా ‘ముకుంద’ పండగకు వచ్చేస్తోందంటూ వార్త వెలువడింది. 

ఇది వెలువడ్డంతో జనాలు, అయితే గోపాల..గోపాల వెనక్కు వెళ్తుందన్నమాట అనేసుకున్నారు. ఎందుకంటే, ఎటూ మెగా హీరోలు ఇద్దరు ఒకేసారి బరిలోకి దిగరన్న ధీమాతో. పైగా సోదరుడి కొడుకు సినిమాపై తన సినిమాను పవన్ వదుల్తుడా? ఆ  మాత్రం సెంటిమెంట్ వుండదా అని కూడా అనుకున్నారు. పైగా గోపాల గోపాల టాకీ పార్ట్, సాంగ్స్ కొన్ని ఇంకా బకాయి వున్నందున, ఫిబ్రవరికి వస్తుందేమో అనుకున్నారు.

కానీ కొన్ని గంటల్లోనే గోపాల గోపాల రెడీ అయిపోతోంది..సంక్రాంతికి రెడీ అంటూ ఏకంగా దగ్గుబాటి సురేష్  ప్రెస్ నోట్ వచ్చేసింది. దీంతో మెగాభిమానులు కాస్త షాకయ్యారు. ఎంత కాదన్నా రెండు వారాలు గ్యాప్ వుండాలి రెండు సినిమాలకు. సినిమాలుఏమైపోతాయన్నది కాదు క్వశ్చను..కోరి బాబాయ్..అబ్బాయ్ ల నడుమ పోటీ కింద చిత్రీకరిస్తారు సహజంగా. 

కానీ అసలు గోపాల గోపాల సంగతి తెలుసుకోవడానికే ముకుంద యూనిట్ ఫీలర్ వదిలిందని, ఇప్పుడు అదే వెనక్కు వెళ్తుందని వార్తలు వినవస్తున్నాయి. లేదంటే, దాదాపు రెడీ అయిపోయింది కాబటి, జనవరి 2న విడుదల చేస్తారని అంటున్నారు. అప్పడు రెండు వారాలు గ్యాప్ సరిపోతుందంటున్నారు.

సురేష్ బాబు సంక్రాంతి సీజన్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరని, ఎలాగైనా సినిమాను రెడీ చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

మెగా గ్రూప్ కు థియేటర్ల సమస్య వుండదు..సురేష్ కు అంతకన్నా వుండదు. కానీ ఎటొచ్చీ  ఈ రెండింటి మధ్య పూరి-ఎన్టీఆర్ సినిమా పరిస్థితి ఏమిటో? ఎంత చెడ్డా వెయ్యి స్క్రీన్ లయినా కావాలి కదా? ఈ మూడు కాకుండా మరి కొన్నిసినిమాలు కూడా బరిలో వుండే అవకాశం వుంది. అప్పుడు థియేటర్లు మరీ టైట్ అయిపోతాయి. చూడాలి ఏం జరుగుతుందో?