శంకర్-విక్రమ్ ల కాంబినేషన్ లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రూపొందిస్తున్న విజువల్ ట్రీట్ ఐ (మనోహరుడు). ఈ సినిమా దీపావళికే వస్తుందనుకున్నారు. కానీ ఇంకా పనులు బకాయి వుండడంతో విడుదల కాలేదు. తెలుగు మీడియాను చెన్నయ్ తీసుకెళ్లి ప్రత్యేకంగా ట్రయిలర్లు చూపించారు. చూసిని జనం అబ్బుర పడ్డారు. ఇప్పుడు తెలుగులో విడుదలైన ట్రయిలర్ కడా జనాలకు బాగా నచ్చింది.
అయితే ఈ సినిమాను ఇటీవల మన తెలుగు కమెడియన్ చాలా వరకు చూసారని తెలుస్తోంది. తమిళ సినిమాలో సంతానం పాత్రకు తెలుగులో కాస్త పాపులర్ వాయిస్ చేత డబ్బింగ్ చెప్పించాలని శంకర్ భావించారట. గతంలో వడివేలుకు ఇలాగే బ్రహ్మానందం చేత డబ్బింగ్ చెప్పించారు.
ఇప్పుడు అందుకు కమెడియన్ శ్రీనివాస రెడ్డి ని ఎంపిక చేసారట. ఆయన ఇటీవలే చెన్నయ్ వెళ్లి డబ్బింగ్ చెప్పి వచ్చారు. డబ్బింగ్ చెప్పిన సీన్లన్నీ చూస్తుంటే కళ్లు చెదిరాయని, అంత అద్భుతంగా వుందని, ఆ విజువల్ అనుభవమే వేరని, శ్రీనివాసరెడ్డి తన సన్నిహతుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైతేనేం తెలుగులో అందరికన్నాముందు ఆ అధ్భుతాన్ని చూసే లక్కీ ఫెలో అయ్యారు శ్రీనివాసరెడ్డి.