Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్‌.. ఫిక్సయిపోవచ్చా.?

అఖిల్‌.. ఫిక్సయిపోవచ్చా.?

అక్కినేని అఖిల్‌ హీరోగా హను రాఘవపూడి (కృష్ణగాడి వీర ప్రేమగాధ, అందాల రాక్షసి చిత్రాల ఫేం) దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందన్నది పాత గాసిప్పే. కానీ, దానికి కాస్త బలం ఇస్తూ, అఖిల్‌ అధికారికంగా ఈ విషయాన్ని తాజాగా ధృవీకరించాడు. గతంలో వంశీ పైడిపల్లితో అఖిల్‌ సినిమా చేయనున్నాడనే ప్రచారం జరిగిందిగానీ, ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. ఆ సినిమాకి సంబంధించి అఖిల్‌ అప్పట్లో కూడా కాస్త తొందరపడి స్టేట్‌మెంట్లు ఇచ్చేశాడు. 

మరిప్పుడు హను రాఘవపూడితో అఖిల్‌ సినిమా చేయనుండడం ఖాయమేనా.? అన్న అనుమానాలకు అక్కినేని క్యాంప్‌ నుంచి ఎలాంటి సమాధానమొస్తుందోగానీ, అఖిల్‌ తొలి సినిమా 'అఖిల్‌' తర్వాత ఇంత గ్యాప్‌ తీసుకోవడం అక్కినేని అభిమానుల్లో టెన్షన్‌ని పెంచేస్తోందన్నది నిర్వివాదాంశం. ఓ పక్క, అక్కినేని నాగచైతన్య నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమయినా, అవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నాయి. ఇంకోపక్క అఖిల్‌ రెండో సినిమా అసలు పట్టాలెక్కడానికే బాలారిష్టాల్ని ఎదుర్కొంటోంది. 

అఖిల్‌, నాగచైతన్య పరిస్థితి ఇలా వుంటే, నాగార్జున మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే 'సోగ్గాడే చిన్ని నాయనా' అంటూ మంచి హిట్‌ అందుకున్న నాగార్జున, ప్రస్తుతం 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా 'నిర్మలా కాన్వెంట్‌' సినిమాలో అతిథి పాత్రలో నాగ్‌ కనిపించనున్న విషయం విదితమే. తండ్రి స్పీడ్‌ని అందుకోవడంలో అటు అఖిల్‌, ఇటు నాగచైతన్య విఫలమవుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?