ఇదిగో అఖిల్ అంటే అదిగో హీరోయిన్ అన్నట్లు తయారైంది పరిస్థితి. సినిమా ప్రారంభమై నత్తనడక నడుస్తోంది కానీ, హీరోయిన్ ఎంపిక మాత్రం పూర్తికాలేదు. కాస్త పేరున్న పాపులర్ హీరోయిన్ కావలన్నది హీరో అఖిల్ కోరిక, బడ్జెట్ లో చేయాలన్నది నిర్మాత బన్నీ వాస్ ఆలోచన. దిశాపటానీని అఖిల్ సజెస్ట్ చేయడం ఆమె మూడు నుంచి నాలుగు కోట్లు అడగడం అయిపోయింది.
ఆఖరికి రెండున్నర కోట్లకు బన్నీ-దిల్ రాజు సినిమాకు దిశాపటానీని ఓకే చేసారు. అఖిల్ సినిమా హీరోయిన్ కథ మళ్లీ మామూలైంది. పూజాహెగ్డే ఖరారు అన్న వార్తలు వచ్చాయి కానీ ఇంకా ఫైనల్ కాలేదని బోగట్టా. అఖిల్ పక్కన పూజా అంత బాగా మ్యాచ్ అవుతుందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. కానీ పూజాహెగ్డేనే ఫైనల్ కావడానికి అవకాశాలు ఎక్కువ అన్నారని తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో నిర్మాత బన్నీవాస్ మరోసారి ఛలో ముంబాయి అన్నారని బోగట్టా. కొత్త అమ్మాయి కోసమా? కాస్త నోటెడ్ హీరోయిన్ కోసమా అన్నది తెలియాల్సి వుంది. ఎప్పటికి హీరోయిన్ ఫైనల్ అవుతుందో? సినిమా ఎప్పుడు స్పీడ్ అందుకుంటుందో?