అక్కినేని అఖిల్ సరసన నటిస్తున్న సయేషా సైగల్ ఫస్ట్ లుక్ స్టిల్స్‌తోనే ఇంప్రెస్ చేసింది. అందగాడైన అఖిల్‌కి సరిజోడి అనిపించుకుంది. వంద మందికి పైగా హీరోయిన్లని స్క్రీన్ టెస్ట్ చేసి చివరకు సయేషని ఓకే చేసారట. అఖిల్ సరసన నటించే హీరోయిన్ కూడా అంతే అందంగా, అప్పీలింగ్‌గా ఉండాలని నాగార్జున చెప్పడంతో హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ కాలేదట.
నాగచైతన్య సక్సెస్‌లో సమంత, తమన్నాలాంటి వాళ్లు ఎంతటి రోల్ ప్లే చేసారో తెలుసు కనుక నాగార్జున హీరోయిన్ విషయంలో రాజీ పడలేదు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కొరత బాగా ఉండడంతో సయేష కనిపించగానే ఆమెకి ఆఫర్లు వెల్లువెత్తుతాయని ముందే ఊహించి ఆమెతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నారట.
దాని ప్రకారం ఆమె అఖిల్ సినిమా పూర్తి చేసే వరకు ఏ దక్షిణాది చిత్రంలోను నటించకూడదట. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్స్ పూర్తయ్యేంత వరకు టీమ్‌తోనే ఉండాలట. ఆ తర్వాతే సయేష కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకోవడం జరుగుతుందట. అంత కష్టపడి అన్వేషించి పట్టుకొచ్చిన హీరోయిన్ విషయంలో ఆమాత్రం జాగ్రత్త ఉండాల్లెండి.