చెర్రీతో యావరేజ్‌.. మరి తారక్‌తో?

కాజల్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరితోను వరుసగా రెండు హిట్స్‌ ఇచ్చింది. చరణ్‌తో మగధీర, నాయక్‌.. తారక్‌తో బృందావనం, బాద్‌షా చిత్రాలతో హిట్స్‌ ఇచ్చి వారికి లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది. అయితే చరణ్‌తో కాజల్‌ నటించిన…

కాజల్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరితోను వరుసగా రెండు హిట్స్‌ ఇచ్చింది. చరణ్‌తో మగధీర, నాయక్‌.. తారక్‌తో బృందావనం, బాద్‌షా చిత్రాలతో హిట్స్‌ ఇచ్చి వారికి లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంది. అయితే చరణ్‌తో కాజల్‌ నటించిన మూడో సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ జస్ట్‌ యావరేజ్‌గా మిగిలింది. 

చరణ్‌ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సాధిస్తుందని అనుకుంటే, ఆ చిత్రం విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. అయితే చరణ్‌తో నటించిన మూడు సినిమాలతోను నలభై కోట్లు సాధించిన ఘనత కాజల్‌కి దక్కింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. బృందావనం, బాద్‌షా సక్సెస్‌ని రిపీట్‌ చేసి తారక్‌తో కాజల్‌ హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేస్తుందా? 

ఎన్టీఆర్‌, పూరి జగన్నాథ్‌లానే ఈ చిత్ర విజయం కాజల్‌కి కూడా చాలా కీలకం. ఇప్పటికే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి కనుక ఇకపై ఆఫర్లు రావాలంటే కాజల్‌ మళ్లీ హిట్‌ ఇవ్వక తప్పదు మరి.