అఖిల్-కొరటాల శివ ప్రాజెక్టు లేనట్లే?

ఈ మధ్య కాస్త వార్తల్లో వినిపించిన ప్రాజెక్టు ఒకటి వుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ఏస్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వుంటుందన్నది ఆ వార్త. ఈ సినిమాను కొరటాల…

ఈ మధ్య కాస్త వార్తల్లో వినిపించిన ప్రాజెక్టు ఒకటి వుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్, ఏస్ డైరక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వుంటుందన్నది ఆ వార్త. ఈ సినిమాను కొరటాల శివే తన స్నేహితుడితో కలిసి నిర్మిస్తారన్నది ఎక్సెటెండెడ్ న్యూస్. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయిందని.

ప్రస్తుతం చేస్తున్న సినిమా తరువాత కొరటాలకు లైన్లో రెడీగా సినిమా లేదు. కొరటాల, సినిమా చేస్తాను అని అంటే హీరోలు, నిర్మాతలు బోలెడు మంది. కానీ పరిస్థితి వేరుగా వుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ ఇలా అందరూ వేరే వేరే ప్రాజెక్టుల్లో బిజీగా వున్నారు. ఒక్క బన్నీ మాత్రమే అవైలబుల్ గా వున్నారు.

కానీ కొరటాలకు బన్నీకి ఎందుకో సెట్ కావడం లేదన్నది ఇండస్ట్రీ గుసగుస. అందుకే కొరటాల అఖిల్ వైపు వెళ్తున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ మరి ఎక్కడ తేడా వచ్చిందో, అఖిల్ ప్రాజెక్టు కూడా డ్రాప్ అయిందని తెలుస్తోంది.

మరి బన్నీ అడుగు ముందుకు వేసి, కొరటాలను తన ఖాతాలోకి తీసుకుంటాడా? అలా చేస్తే, బన్నీకి మరో మంచి సినిమా వచ్చినట్లే. కానీ ఏం చేస్తారో? ఏం జరుగుతుందో చూడాలి.