అఖిల్ కు సరైన లాంచింగ్ డైరక్టర్ కోసం నాగ్ కిందా మీదా అవుతున్నాడు. ఆఖరికి వినాయక్ ను ఫైనల్ చేసి, మరో మంచి ఆప్షన్ ఏమన్నా దొరుకుతుందా అని కూడా చూస్తున్నాడు. త్రివిక్రమ్ తో సినిమా చేయించాలన్నది నాగ్ కోరికగా తెలుస్తోంది.
కానీ ఇప్పుడు బన్నీ సినిమా, ఆ తరువాత మహేష్ సినిమా కమిట్ అయి వున్నారాయన. మహేష్ ఎలాగూ రెండు సినిమాలు ఇంకా చేయాల్సి వున్నందున, తన సన్నిహిత సంబంధాలు ఉపయోగించి, మధ్యలో తన సినిమా చేయించితే ఎలా వుంటుందని నాగ్ డిస్కస్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం త్రివిక్రమ్ తో చర్చించినట్లు, దానికి ఆయన చాలా సున్నితంగా, అవును, కాదు అన్న స్టయిల్ లో తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
మహేష్ ఓకె అంటే తనకు అభ్యంతరం లేదన్నది త్రివిక్రమ్ భావనగా వుంది. కానీ ఇక్కడ నిర్మాత కూడా వుంటారు కదా. నిర్మాతను కూడా ఒప్పించాలి. ఈ దిశగా ప్రయత్నాలు చేసి, సాధ్యమైతే త్రివిక్రమ్ లేదంటే, వినాయక్ అని నాగ్ ఫిక్సయ్యాడు అని అంటున్నారు సినిమా జనాలు.