అఖిల్ కు థియేటర్లు దొరుకుతాయా?

గట్టిగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య వచ్చేస్తుంది. మళ్లీ కాస్త ఆగితే, సినిమాల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. అయితే మల్టీ ఫ్లెక్స్ లు పెరగడం, స్క్రీన్లు..షోలు లెక్కన సినిమాలు ప్రదర్శించడం…

గట్టిగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య వచ్చేస్తుంది. మళ్లీ కాస్త ఆగితే, సినిమాల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. అయితే మల్టీ ఫ్లెక్స్ లు పెరగడం, స్క్రీన్లు..షోలు లెక్కన సినిమాలు ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు కాబట్టి కాస్త నడిచిపోతోంది. అయినా కూడా థియేటర్ల సమస్య కొంతవరకు తప్పడం లేదు. ఇప్పుడు దసరా సీజన్ ది కూడా అదే పరిస్థితి. నిజానికి పులి, శివమ్ డిజాస్టర్లుగా మారాయి కాబట్టి కానీ, లేకుంటే ఇంకా సమస్యగా వుండేది. రుద్రమదేవి ఎంత కాదన్నా చాలా థియేటర్లలో రెండు నుంచి మూడు వారాలు వుండేలా వుంది. ఖర్చులు వస్తున్నంత కాలం తీసేయరు. 

అయితే ముందుగా సింగిల్ వీక్ అగ్రిమెంట్లు వున్నదగ్గర తీయక తప్పదు. అలా తీసే చోట్ల బ్రూస్ లీ వచ్చి కూర్చుంటాడు. అక్కడ కూడా వన్ వీక్ అగ్రిమెంట్లు వుంటే తప్ప తీయడం జరగదు. అలా ఎన్ని థియేటర్లు అఖిల్ కు దొరుకుతాయి అన్నది చూడాలి. అఖిల్ సినిమా విడుదలైన తరువాత దసరా హాలీడేస్ గట్టిగా వారం పది రోజులు కూడా వుండవు. అందువల్ల కాస్త గట్టిగా థియేటర్లు కావాలి..రికార్డులు కావాలన్నా కూడా అదే సమస్య. రెండు పెద్ద సినిమాలు వుంటే ఓకె. సర్దుకోవచ్చు..మూడు సినిమాలు అంటే కాస్త కష్టమే. 

దీనికి తోడు అఖిల్ కు పబ్లిసిటీ అంతంత మాత్రంగా వుంది. గట్టిగా పది రోజులు లేదు, కానీ పబ్లిసిటీ మాత్రం స్టార్ట్ చేయలేదు. మరోపక్క అఖిల్ చూపు నేషనల్ మీడియా వైపు వుంది. అది మన బి సి సెంటర్లను ఏ మేరకు ప్రభావం చేయగలదో తెలిసిందే. కానీ నాగార్జున స్టయిల్ మాత్రం ఇది కాదు. ఆయన తన సినిమాలు అన్నింటికీ పబ్లిసిటీ పక్కాగా ప్లాన్ చేసేవారు.  కానీ దీనికి నిర్మాత ఆయన కాదు. పైగా ఆయన సినిమాలు, టీవీ షోలతో బిజీగా వున్నారు. దాంతో ఆయన సలహాలు అందుతున్నట్లు కనిపించడం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.