రమ్యకృష్ణ..గ్లామరస్, మిడిల్ ఏజ్డ్ మదర్. బాహుబలితో మరోసారి తన సత్తా ఏమిటో చూపించింది. ఇప్పుడు ఆమెను తమ సినిమాలో మదర్ క్యారెక్టర్ కు తీసుకుంటే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారు ఒక్క మనసు నిర్మాతలు.
ఈ సినిమాతోనే నాగబాబు కుమార్తె నీహారిక తెరంగ్రేటం చేస్తున్నారు. సినిమాలో నీహారిక తల్లి పాత్ర కు కూడా కాస్త కీలకమైందే. ఆ క్యారెక్టర్ కు రమ్యకృష్ణ అయితే ఎలా వుంటుంది అని థింక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను అడిగి, తమ బడ్జెట్ పర్మిట్ చేస్తే, ముందుకు వెళ్లాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు.
లేదూ అంటే, ఇటీవల చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా చేస్తున్న పవిత్రా లోకేష్ వుండనే వుంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు రామరాజు. నిర్మాత మధుర శ్రీధర్.