కొందరికి కొన్ని అభిరుచులు వుంటాయి..కొన్ని సినిమాలపై మోజు వుంటుంది. అక్కినేని అఖిల్ కు కూడా ఇప్పుడు ఓ సినిమాపై విపరీతమైన మోజు వుందట. ఆ సినిమాను ఎలాగైనా రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అది మరే సినిమా కాదు, బాలీవుడ్ బ్లాక్ బస్టర్..యేహ్..జవానీ..యేహ్ దివానీ.. రణబీర్ కపూర్..దీపికా పడుకొనె నటించిన ఈ సినిమా 2013లో బాలీవుడ్ సూపర్ హిట్ లలో ఒకటి.
ఈ సినిమాను రీమేక్ చేస్తే, నటించాలని అఖిల్ కోరిక. కానీ ఇక్కడో చిక్కువుంది. బాలీవుడ్ లో ఈ సినిమాను నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్ వాళ్లు రీమేక్ రైట్లు అమ్మరు. అది వాళ్ల పాలసీ. అందుకే ఇప్పుడు వాళ్ల రైట్స్ నే పెట్టుబడిగా, వాళ్లను పార్టనర్ లుగా తీసుకుని,అన్నపూర్ణ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించాలని నాగ్ ఆలోచనగా తెలుస్తోంది. నాగ్ కు బాలీవుడ్ తో వున్న సంబంధాలు తెలిసినవే.అందువల్ల ఆయన అనుకంటే ఈ డీల్ కుదరడం పెద్ద కష్టమేమీ కాదు.
కానీ దీపికా రేంజ్ లో నటించే హీరోయిన్ కావాలి. ఆ ఒరిజినల్ ఫ్లావర్ చెడకుండా, ఫీల్ ను క్యారీ చేయగల డైరక్టర్ కావాలి..ఎవరు దొరుకుతారో?