రవితేజ ఎనిమిదికి తగ్గట్లేదు

హీరో రవితేజ,,బాడీ చిక్కింది.. మార్కెట్ కూడా అలాగే చిక్కింది. కానీ చిక్కినా తగ్గను కాక తగ్గను అంటున్నాడట. ఎనిమిది కోట్లకు రూపాయి తగ్గినా సినిమా చేయనని అంటున్నాడట. దాంతో దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్…

హీరో రవితేజ,,బాడీ చిక్కింది.. మార్కెట్ కూడా అలాగే చిక్కింది. కానీ చిక్కినా తగ్గను కాక తగ్గను అంటున్నాడట. ఎనిమిది కోట్లకు రూపాయి తగ్గినా సినిమా చేయనని అంటున్నాడట. దాంతో దిల్ రాజు-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా అటకెక్కేసిందని వినికిడి. 

కిక్ 2 తరువాత రవితేజ మార్కెట్ పడింది. కానీ బెంగాల్ టైగర్ టైటిల్,దానికి వచ్చిన హైప్, సంపత్ నంది పుణ్యమా అని ముఫై కోట్లకు పైగా బిజినెస్ చేసింది. దాన్ని చూపించి, తనకు ఎనిమిది కోట్ల రెమ్యూనిరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నాడట. కానీ దిల్ రాజు బెంగాల్ టైగర్ బిజినెస్, కొన్ని ఏరియాల్లో దాని లాస్ చూసి, సారీ అంటున్నాడట. 

దీంతో ఆ సినిమా అలా అబేయన్స్ లో వుండిపోయింది. మరో కొత్త దర్శకుడితో ఫ్రాజెక్టు సెట్ చేసి, రంజిత్ మూవీస్ దామోదర ప్రసాద్ గారిని నిర్మించమని అడుగుతున్నాడట రవితేజ. వున్నదాన్ని వదులుకోవడం ఎందుకో..వేరే వాళ్లని అడగడం ఎందుకో? కాస్త రెమ్యూనిరేషన్ తగ్గించుకుంటే పోలా?