Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ ను పక్కన పెట్టిన నాగ్?

అఖిల్ ను పక్కన పెట్టిన నాగ్?

నాగార్జున ఇప్పుడు ఫుల్ బిజీ..ఆమాటకు వస్తే, ఎప్పుడూ బిజీనే. ఇప్పుడు మరీ బిజీ అయిపోయారు. ఒక పక్క సినిమాలు..మరోపక్క స్టూడియో..ఇంకో పక్క మీలో ఎవరు కోటీశ్వరుడు..ఇవన్నీ కాక..బోలెడు ఇతరత్రా వ్యవహారాలు. వీటన్నింటికి మించి అఖిల్..చైతూల సినిమాల వ్వవహారాలు. 

ఇలా బిజీగా వున్న నాగ్ ఇప్పుడు అఖిల్ సినిమా గురించి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట. ఇప్పుడు టైమ్ అంతా ఎక్కువగా సోగ్గాడే చిన్న నాయనా వ్వవహరాల్లోనే బిజీగావుంటున్నాడట. దాంతో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా.అందుకే సోగ్గాడు విడుదలయ్యేదాకా ఏ నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది. 

అలాగే అఖిల్ రెండో సినిమా విషయంలో బండ్ల గణేష్ పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు మళ్లీ మారిందని వినికిడి. ధర్మా ప్రొడక్షన్స్..అన్నపూర్ణ కలిసి యే జవానీ యే దివానీ రీమేక్ పై ఇప్పుడు దృష్టి పెట్టారట. అయితే ఆ డిస్కషన్ కూడా ఈ నెల ఇరవై తరువాతే అని తెలుస్తోంది. మొత్తానికి నాగ్ తన కెరీర్..పిల్లల కెరీర్ విషయంలో బాగా సతమతం అవుతున్నట్లు కనిపిస్తోంది,.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?