Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అఖిల్ తో 'ఫ్యామిలీమాన్'

అఖిల్ తో 'ఫ్యామిలీమాన్'

హీరో అఖిల్ మెలమెల్లగా మాంచి లైనప్ సెట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ ఓ సినిమాను గీతా సంస్థలో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో చేస్తున్నారు. 

దీని తరువాత సినిమాను ఇప్పటికే ప్లాన్ చేసి పెట్టారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఆ సినిమా చేయబోతున్నారు. దీని తరువాత సినిమాను కూడా ప్లాన్ చేసేసారు. అయితే ఈసినిమాను అఖిల్ కోసం సెట్ చేసింది ఎవరనుకుంటున్నారు. 

స్వయానా అఖిల్ వదినగారు సమంతనే. ఆమె ఈ మధ్య బాలీవుడ్ లో ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ చేసారు. ఆ సిరీస్ లో టెర్రరిస్ట్ గా సమంత నటించిన సంగతి తెలిసిందే. 

ఆ టైమ్ లోనే ఆ వెబ్ సిరీస్ డైరక్టర్ రాజ్-డికె లతో ఓ తెలుగు సినిమాను సెట్ చేసినట్లు, దాంట్లో అఖిల్ హీరోగా నటిస్తారని తెలుస్తోంది.

నిజానికి డికె-రాజ్ లు తెలుగువారే. రాజ్ నిడుమూరు, కృష్ణ డికె అనే ఈ ఇద్దరు గతంలో డి ఫర్ దోపిడీ అనే సినిమాను తెలుగులో చేసారు కూడా. ఇప్పుడు అఖిల్ తో మాంచి యాక్షన్ మూవీని చేయబోతున్నారని తెలుస్తోంది. ఇది కచ్చితంగా అఖిల్ ఫ్యాన్స్ కు శుభవార్తే. ఈసినిమాను అశ్వనీదత్ నిర్మిస్తారు.

జ‌య‌మ్మ క్యారెక్ట‌ర్ ఇంత బాగా రావడానికి కార‌ణం అయ‌నే

మంచి కిక్‌ ఇచ్చారు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?