అతగాడో స్టార్ హీరో. ఫ్యామిలీ అంటే ప్రాణం పెడతాడు. ఏటా అన్నకు, అక్కకు చెరో సినిమాకు డేట్స్ ఇచ్చేవాడు. వాళ్లు చేసుకున్నా చేసుకోకున్నా, వేరే నిర్మాతకు అమ్ముకుంటే కనీసం కోటి రూపాయిలు వస్తాయి. అంటే ఈ తమ్ముడి వల్ల ఆ అన్న, అక్కకు అదో ఆదాయం. మంచి విషయమేగా. ప్రత్యేకంగా తను ఇవ్వక్కర్లేకుండా, ఆదాయం చూపించే మార్గం.
కానీ ఇటీవల్ వున్నట్లుండి ఆ పద్దతి కట్ అయిపోయిందని వినికిడి. ఎప్పుడైనా తమ్ముడే కానీ, మరదలు వచ్చాక కాదు కదా..అందుకే ఆ మరదలు స్వంత కంపెనీని ఫ్లోట్ చేయించి, డేట్లు మొత్తం ఆ కంపెనీకి అగ్రిమెంట్ చేయించేసినట్లు వినికిడి. దాంతో ఇక అన్న, అక్కలకు నో డేట్స్ అంట. అయితే అప్పుడప్పుడు మాత్రం అక్కకు సరదాగా, సంతోషంగా ఏదో ఒకటి ఇస్తుంటాడట..అది కూడా సదరు మరదలికి తెలియకుండా..అంతే లెండి..ఎవరి ఫ్యామిలీ సమస్యలు వారివి. తప్పదు. లోకం తీరే అంత.