బండ్ల గణేష్..టెంపర్ తరువాత మళ్లీ ఇంతవరకు సినిమా లేదు. పెద్ద హీరోల డేట్లు దొరక్కపోవడమే కారణం. తీస్తే ఆ టాప్ రేంజ్ జనాలతోనే సినిమా చేస్తా…లేదంటే లేదు..అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. కానీ దానివల్ల ఇఫ్పుడేమయింది..బ్యానర్ కంటిన్యూ కాకుండా పోయింది. ఇన్నాళ్లకు టూ కంట్రీస్ అనే మలయాళీ హిట్ సినిమా కొన్నాడు. అలా అని అందరికీ తెలిసిపోయింది కూడా.
అయినా ఇంతవరకు ఏ హీరో కూడా నేను రెడీ అని చెప్పిన దాఖలాలు లేవు. బండ్ల కొనక ముందే సునీల్ ఈ సినిమా చూసాడు.. చేస్తారా..కొంటాం అని ఎవరో అడిగితే నో అన్నాడట. ఇప్పుడు ఈ సినిమా బండ్ల చేతికి వచ్చింది..ఎవరు చేస్తారా అని చూస్తుంటే, ఎవరు పలకడం లేదు. ఇలాంటి సబ్జెక్ట్ కు వెంకీ లేదా రవితేజ బాగా సూటవుతారు. మరి బండ్ల వాళ్లని అప్రోచ్ అయ్యాడో లేదో తెలియదు. బండ్ల కు హీరో డిసైడ్ కాలేదు కానీ, ఇద్దరు డైరక్టర్లయితే రెడీగా వున్నారు..శ్రీనువైట్ల..హరీష్ శంకర్.
అసలు బండ్ల ఆలోచనే కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిర్మాత అన్నాక, చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదో ఒకటి చేస్తూ వుండాలని, టాప్ హీరోలు అంటూ కూర్చుంటూ ఎలా అని ప్రశ్నలు వినిపిస్తునాయి. గీతాఆర్ట్, యువి క్రియేషన్స్ లాంటి సంస్థలు మంచి మంచి సిని మాలు చేస్తున్నాయి..మరి అలా ఎందుకు చేయకూడదు అన్నది పాయింట్. కానీ బండ్ల మాత్రం తీస్తే టాప్ హీరోతొనే అంటున్నాడు. దాంతో ఇటు హీరోలు, అటు ప్రేక్షకులు బండ్ల బ్యానర్ ను మరిచిపోయే ప్రమాదం వుంది.