సునీల్..ఓ మంచి కమెడియన్. కానీ అందరికీ ఆశలుంటాయిగా..అందుకే హీరో అయిపోయాడు. కానీ హీరో అయిన దగ్గర నుంచీ అన్నీ ఎత్తుపల్లాలే. విపరీతమైన రూమర్లే. ఇషా చావ్లాతో చెట్టపట్టాలు అంటూ వదంతులు. ఫైట్లు లేని సినిమా చేయనంటున్నాడంటూ వార్తలే. కాస్త గ్యాప్ తరువాత ఇప్పుడు కృష్ణాష్టమి చేస్తున్నాడు సునీల్..ఇప్పుడు ఈ సినిమా విషయంలోనూ అనేక గ్యాసిప్ లు వినవస్తున్నాయి.
దర్శకుడు వాసు వర్మ, హీరో సునీల్ కలిసి, నిర్మాత దిల్ రాజును పక్కన పెట్టి, సినిమాను తమ చిత్తం మేరకు ఎడిట్ చేయించారని టాక్, ఎడిటర్ గౌతం రాజు బిజీ గా వుండడంతో, జూనియర్స్ పని చేసారట. దాంతో సునీల్ తన అభిరుచుల మేరకు పని చేయించారట. అలాగే సీన్లు, ట్రీట్ మెంట్, స్క్రిప్ట్ విషయంలో కూడా దిల్ రాజు మాట కన్నా, వాసువర్మ, సునీల్ మాటే నెగ్గిందట.
ఇవన్నీ ఇలా వుంటే నిన్నటికి నిన్న సిసిఎల్ ఫైనల్ సందర్భంగా కృష్ణాష్టమి సినిమా పబ్లిసిటీ కోసం ఓ స్లాట్ సంపాదించి, ప్రోగ్రామ్ ఫిక్స్ చేసారట. తీరాచేస్తే సునీల్ రాను పొమ్మన్నాడట. అటు తను చేస్తున్న ఆకెళ్ల వంశీ కృష్ణ సినిమాకు డుమ్మా కొట్టాడట..కృష్ణాష్టమి పబ్లిసిటీ కి టైమ్ కావాలని. ఇటు పబ్లిసిటీకి రాలేదు. ఏం చేస్తున్నాడా అని ఆరా తీస్తే, డీటీఎస్ మిక్సింగ్ లో వున్నాడట. డీటీఎస్ మిక్సింగ్ తో హీరోకేం పని? అదే సున్నితంగా చెప్పి, రమ్మన్నా, తనకు ఇది చాలా కీలకం అని..రానని తెగేసి చెప్పేసాడట.
దీంతో చేసేది లేక దిల్ రాజు తల పట్టుకున్నడట. ఈవిషయంలో సునీల్ వైఖరిపై దిల్ రాజు చాలా ఆగ్రహంతో వున్నట్లు గుసగుసలు వినిపిస్తన్నాయి.