ఎడమచెయ్యి మాట వినకపోవడం అన్న పాయింట్ ను యాక్షన్, సెంటిమెంట్ ల్లో రంగరించి సవ్యసాచిగా మార్చాడు చందు మొండేటి. బహుశా అదే ఐడియా కలలోకి వచ్చి వుంటుంది కన్నడ దర్శకుడు అర్జున్ కుమార్ కు. అందుకే ఆరేడు నెలలు ముందుగానే కన్నడంలో ఓ కామెడీ రోమాంటిక్ మూవీ తీసి వదిలాడు. సంకష్ట కర గణపతి అనే పేరిట వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ వుండదు. అంతా ఫన్ అండ్ లవ్.
చిత్రమేమిటంటే, ఈ సినిమా నవంబర్ 1న అమెజాన్ లో విడుదలవుతోంది. నవంబర్ 2న అదే తరహా సిండ్రోమ్ ఆధారంగా తయారైన సవ్యసాచి విడుదలవుతోంది. సరే, ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. జస్ట్ ఎడమ చెయి సమస్య అన్నదే పాయింట్. అయితే అలా అని ఆ సినిమాను చందు మొండేటి చూడలేదు అని అనుకోవడానికి లేదు.
ఎందుకంటే సంకష్ట కర గణపతి సినిమా ట్రయిలర్లో ఓ సీన్ ను మన సవ్యసాచిలో యాజ్ ఇట్ ఈజ్ గా లేపేసారు. అమ్మాయి వెళ్లిపోతుంటే ఎడం చేయి దానంతట అది ఆ అమ్మాయి బ్యాక్ మీద చిన్నగా కొట్టే సీన్ అది.
సరే, ఆ సంగతి అలా వుంచితే సవ్యసాచిలో చైతూను తొలిసారి మైథలాజికల్ పాత్రలో కూడా చూపిస్తున్నాడు చందు మొండేటి. అర్జునుడి గెటప్ లో అన్నమాట. సినిమా సెకండాఫ్ మొత్తం హీరో, విలన్ మధ్య పోరుతో, ఛాలెంజ్ తో సాగుతుంది అని టాక్. మరి ఈ మైథలాజికల్ ముచ్చట ప్రథమార్థంలో వస్తుందేమో?
ఏమైనా అసలైన సవ్యసాచి చందు మొండేటినే..ఫస్ట్ సోషియో థ్రిల్లర్, రెండోసారి లవ్వబుల్ రీమేక్. ముచ్చటగా మూడోసారి సైన్స్ టచ్ వున్న యాక్షన్, సెంటిమెంట్ సినిమా.