పారలల్ లైఫ్ అన్న పాయింట్ ఆధారంగా తెరకెక్కుతోంది ఒక్క క్షణం సినిమా. ఈ సినిమాకు హీరో అల్లు శిరీష్. దర్శకుడు ఆనంద్. వీరి సినిమా కెరీర్ కూడా పారలల్ లైఫ్ మాదిరిగానే వుందంటున్నారు యూనిట్ జనాలు. అదెలా అంటే భలే చిత్రమైన ఈక్వేషన్ చెబుతున్నారు. అదేంటంటే..
విఐ ఆనంద్ ఫస్ట్ సినిమా హృదయం ఎక్కడ ఉన్నాదీ.. అదే మంత గొప్ప చిత్రం కాదు. రెండో సినిమా టైగర్. జస్ట్ హిట్ అనిపించుకుంది. మూడో సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా.. సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక అల్లు శిరీష్ ఫస్ట్ సినిమా గౌరవం. ఆ సినిమా సంగతి తెలిసిందే. రెండో సినిమా కొత్త జంట. మారుతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అనిపించుకుంది. మూడో సినిమా శ్రీరస్తు శుభమస్తు. ఈ సినిమాకు పరుశురామ్ డైరక్టర్. మంచి సినిమా, లాభం ఇచ్చిన సినిమా అనిపించుకుంది.
ఇప్పుడు ఆనంద్ కు, శిరీష్ కు కూడా ఒక్క క్షణం నాలుగో సినిమా. స్టెప్ బై స్టెఫ్ ఇధ్దరు ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు కనుక, ఈ సినిమాతో ఇద్దరు మంచి విజయం సాధిస్తారని, పారలల్ జోస్యం చెబుతోంది యూనిట్.