అక్కడంత లేదట

సినిమా రంగంలో వార్తలు అదిగో లైన్ అంటే ఇదిగో సినిమా అనే రేంజ్ లో పుట్టుకొచ్చేస్తాయి. సోగ్గాడే చిన్ని నాయనా విడుదలై, హిట్ అనిపించుకోగానే కనిపించిన, వినిపించిన గ్యాసిప్..అఖిల్ రెండో సినిమా కళ్యాణ్ డైరక్షన్…

సినిమా రంగంలో వార్తలు అదిగో లైన్ అంటే ఇదిగో సినిమా అనే రేంజ్ లో పుట్టుకొచ్చేస్తాయి. సోగ్గాడే చిన్ని నాయనా విడుదలై, హిట్ అనిపించుకోగానే కనిపించిన, వినిపించిన గ్యాసిప్..అఖిల్ రెండో సినిమా కళ్యాణ్ డైరక్షన్ లో అనే. లైన్ కాదు..కాదు..కథే చెప్పేసాడని..అఖిల్ ను డైరక్ట్ చేయమని నాగార్జునే అప్పగించాడని ఇంకా..ఇంకా..చాలా. కానీ అసలు విషయం ఏమిటంటే ఇదంతా గ్యాసిప్పేనంట. 

ఇప్పటి దాకా నాగార్జున తన రెండోకొడుకు అఖిల్ రెండోసినిమా గురించే ఇంకా ఆలోచించలేదట. ప్రస్తుతం సోగ్గాడు విడుదల అనంతర వ్యవహారాలు, ఇతరత్రా వ్యవహారాల్లో బిజీగావున్నాడట. అఖిల్ రెండో సినిమా అయితే తన స్వంత బ్యానర్ లో చేయాలని మాత్రం అనుకుంటున్నాడట. దర్శకుడు ఎవరన్నది ఇంకా అస్సలు ఫిక్స్ కాలేదట. 

వైవిధ్యంతో కూడిన మాంచి యూత్ లవ్ స్టోరీ కోసం వెదుకుతున్నారని వినికిడి. రొటీన్ పాయింట్ అస్సలు కూడదని, డైరక్టర్ కూడా ఫుల్ స్టామినా వున్నవాళ్లే కావాలని అనుకుంటున్నాడట. మణిరత్నంను సంప్రదించారని, అయితే ఆయన ఇప్పుడు రానా-చైతూలతో సినిమా చేయిలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. 

నిజానికి కళ్యాణ్ తో చేసిన సోగ్గాడు…సినిమాను చాలా వరకు రీ షూట్ చేయాల్సి వచ్చింది. మొదట కళ్యాణ్ చేసిన స్క్రిప్ట్ ను పక్కన పెట్టి, బుర్రా సాయి మాధవ్ తో మళ్లీ చాలా వరకు తయారు చేయించారని వినికిడి. సినిమా హిట్ అయింది కానీ పరిశీలనగా చూస్తే గ్యాప్ లు, మ్యాచ్ కాని సీన్ల అతుకు కనిపిస్తుంది. అందుకే కళ్యాణ్ కు మళ్లీ నాగ్ వెంటనే అవకాశం ఇస్తారా అన్నది అనుమానం. లైన్ నచ్చాలి..కథ తయారు కావాలి..స్క్రిప్ట్ లోపరహితంగా వుండాలి..నాగ్ కు ఇప్పుడు జాగ్రత్తలు మరీ ఎక్కువయ్యాయి..అఖిల్ ఫ్లాప్ తరువాత..సోగ్గాడు హిట్ తరువాత.