విధి బలీయమైనది..ఏదో అనుకుంటే మరేదో అయిపోతుంది..అందుకే. అనగనగా ఓ పర్సనల్ మేకప్ మాన్..వున్నట్లుండి హీరోకి ఎందుకో, మరెందుకో ఓ అయిడియావచ్చింది..తన తరువాతి సినిమాకు ఈ పర్సనల్ మేకప్ మన్ నే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సరే, నిర్మాత కూడా సై అన్నాడు. అంతే ఈ పర్సనల్ మేకప్ మాన్ కు కొత్త హోదా భలే కిక్కిచ్చేసింది. నిర్మాతపై స్వారీ ప్రారంభించేసాడని వినికిడి.
రెండుకోట్లు బ్యాంకులో వేస్తేనే ప్రొడక్షన్..నా రెమ్యూనిరేష్ ఫిక్స్ చేయాలి…అందులో ఫిఫ్టీ పర్సంట్ ముందుగానే చెల్లించాలి. అంటూ ఇలా టెర్మ్స్ డిక్టేట్ చేసాడట. దాంతో ఆ నిర్మాతకు చిర్రెత్తింది..ఇదేంటిదంతా..అంటూ హీరో దగ్గర పంచాయతీ పెట్టినట్లు వినకిడి.
కట్ చేస్తే..హీరో డెసిషన్ రివర్స్ అయింది. మేకప్ మాన్ అదనపు ప్రొడక్షన్ బాధ్యతలు కట్ అయిపోయాయి.అంతే కాదు..పర్సనల్ మేకప్ మాన్ కూడా వద్దనేసాడట హీరో. ఇప్పుడు కొత్త ఉద్యోగం..పాత కొలువు రెండూ లేకుండా అయిపోయి, మరో క్యారెక్టర్ ఆర్టిస్టు కమ్ డైరక్టర్ దగ్గర మేకప్ మెన్ కొలువు వెదుక్కున్నాడట.
టాలీవుడ్ లో అంతే, కాస్త జాగ్రత్తగా వుండకుంటే, కాళ్ల కింద నేల కదిలిపోతుంది.