ఫ్యాక్షన్ సినిమాలతో నందమూరి ఫ్యామిలీ హీరోలు రెడ్డి ట్యాగ్ తగిలించుకుని సినిమాలు చేసారు. మెగా హీరో చిరంజీవి అదే పని చేసారు. టైటిల్ పెట్టకోకపోయినా, బన్నీ కూడా చేసేసారు. ఇప్పుడు అక్కినేని హీరోల వంతు వచ్చినట్లుంది. నాగ చైతన్య సినిమాకు రెడ్డి టైటిల్ పెడదామని ముచ్చట పడుతున్నారు దర్శకుడు మారుతి.
నాగ చైతన్యతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ చేయబోయే సినిమాకు శైలజరెడ్డి అల్లుడు అనే టైటిల్ ఏక్టివ్ కన్సిడరేషన్ లో వుందట.
ఇంతకీ ఈ శైలజరెడ్డి ఎవరు అనుకుంటున్నారు. మోస్ట్ ఫవర్ ఫుల్ మాహిష్మతి రాజమాత శివగామే. అదేనండీ రమ్యకృష్ణ. గతంలో ఎన్టీఆర్, అల్లరి నరేష్ లాంటి వాళ్లకు అత్తగా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు నాగ చైతన్యకు అత్తగా మారబోతోంది. అంటే సినిమా టైటిల్ రమ్యకృష్ణ పేరు మీదే వుంటుంది శైలజరెడ్డి అల్లుడు అంటూ.
అంతా ఓకె. అంతా రెడీ. కానీ నాగ్, నాగ చైతన్య టైటిల్ కు ఓకె స్టాంప్ వేయాల్సి వుంది.