అన్ని గ్యాసిప్ లు ఒకేలా వుండవు. అన్నీ అందరినీ ఇబ్బంది పెట్టవు. కొన్ని కొందరికి ఆనందాన్ని కూడా పంచుతాయి. ఓ లేటెస్ట్ గ్యాసిప్ మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు ఆనందాన్ని పంచింది. విషయం ఏమిటంటే, డైరక్టర్ మారుతి మహానుభావుడు సినిమాకు థమన్ పనిచేసారు.
ఈ మధ్య కాలంలో థమన్ అందించిన మంచి అడియో అని పేరు వచ్చింది. దీంతో మారుతి తరువాతి ప్రాజెక్టు గా ప్లాన్ చేస్తున్న నాగ చైతన్య సినిమాకు కూడా థమన్ నే మ్యూజిక్ డైరక్టర్ అని గ్యాసిప్ వండేసారు. దీంతో థమన్ చకచకా రీ ట్వీట్ లు కొట్టినట్లు తెలిసింది.
కానీ విషయం ఏమిటంటే, ఈసారి మారుతి మ్యూజిక్ డైరక్టర్ గా గోపీ సుందర్ ను తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. భలే భలే మగాడివోయ్ కు మారుతితో కలిసి గోపీ సుందర్ పనిచేసారు. ఇప్పుడు ఈ సంగతి థమన్ కు ఎవరు చెపుతారో? అలా చెపితే పాపం, థమన్ ఉత్సాహం అంతా నీరు కారిపోతుంది. ఓ పెద్ద ప్రాజెక్టు వచ్చిందనుకుంటే జారిపోయిందే అనిపిస్తుంది.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. నాగ చైతన్య హానీమూన్ నుంచి రాగానే, ఇచ్చే డేట్ లను బట్టి ఈ సినిమా స్టార్ట్ అవ్వడం అన్నది డిసైడ్ అవుతుంది.