ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు నాని. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎంసీఏ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. మరోవైపు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ మూవీ కూడా దిల్ రాజు గూటికే చేరింది.
తాజా సమాచారం ప్రకారం, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాను కూడా దిల్ రాజే టేకప్ చేసినట్టు తెలుస్తోంది. మొదట్నుంచి ఈ ప్రాజెక్టుపై ఓ కన్నేసి ఉంచిన దిల్ రాజు.. సినిమాకు సంబంధించి ఏపీ, నైజాం థియేట్రికల్ రైట్స్ ను ఒకేసారి దక్కించుకున్నట్టు టాక్.
హిట్ సినిమాల్ని పిక్ చేయడంలో దిల్ రాజుకు మంచి పేరుంది. సో.. కృష్ణార్జున యుద్ధం కూడా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం నానికి మంచి మార్కెట్ ఉండడంతో దిల్ రాజు ఛాయిస్ కరెక్ట్ అంటున్నారు చాలామంది.
ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు నాని. ఒక పాత్ర పారిస్, మరో క్యారెక్టర్ తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. హిపాప్ తమీజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.