అక్కినేని మాయగాడు

నాగచైతన్య ప్రస్తుతం బ్రేక్‌ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. గత మూడు నెలల్లో అతనివి మనం, ఆటోనగర్‌ సూర్య రిలీజ్‌ కాగా, సెప్టెంబర్‌లో ‘ఒక లైలా కోసం’ రిలీజ్‌ కానుంది.…

నాగచైతన్య ప్రస్తుతం బ్రేక్‌ లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. గత మూడు నెలల్లో అతనివి మనం, ఆటోనగర్‌ సూర్య రిలీజ్‌ కాగా, సెప్టెంబర్‌లో ‘ఒక లైలా కోసం’ రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం రిలీజ్‌కి సిద్ధపడుతుండగా చైతన్య తన తదుపరి చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేస్తున్నాడు. 

స్వామిరారా దర్శకుడు సుధీర్‌వర్మతో చైతన్య ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. క్రైమ్‌ కామెడీ అయిన ఈ చిత్రంలో చైతన్య మాయగాడి పాత్ర చేస్తున్నాడు. ఆడియన్స్‌కి థ్రిల్‌ ఇచ్చే సర్‌ప్రైజ్‌లు ఈ చిత్రంలో చాలా ఉంటాయట. హీరో తెరపై పాత్రలనే కాకుండా ప్రేక్షకులని కూడా మాయ చేస్తుంటాడట. 

దీనికి ‘మాయగాడు’ అనే టైటిల్‌నే ఖరారు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో చైతన్య సరసన ‘1 నేనొక్కడినే’ హీరోయిన్‌ క్రితి సనన్‌ కథానాయికగా నటిస్తోంది. స్వామిరారాతో దర్శకుడిగా ఇంప్రెస్‌ చేసిన సుధీర్‌ వర్మ డైరెక్ట్‌ చేస్తుండడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.